ఆదివారం 29 నవంబర్ 2020
Peddapalli - Jul 02, 2020 , 03:41:12

కనిపించే దేవుళ్లు డాక్టర్లు

కనిపించే దేవుళ్లు డాక్టర్లు

కోల్‌సిటీ: గోదావరిఖని నగరంలో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో బుధవారం జాతీయ వైద్యుల, చార్టడ్ అకౌంట్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  మేయర్ డాక్టర్ బంగి అనిల్‌కుమార్ హాజరై డాక్టర్లు క్యాస శ్రీనివాస్, జీవన లత, వెంకటేశ్వర్లు, లక్ష్మీవాణి, శ్రీకాంత్, కవిత, సీఏ మణివర్ధన్‌ను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, వైద్యులు ప్రాణదాతలని, తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా వైరస్ బాధితులకు ఆప్యాయంగా వైద్యం అందిస్తున్నారని కొనియాడారు. అలాగే దేశ ఆర్థిక అభివృద్ధికి బాటలు వేసే చార్టర్డ్ అకౌంటెంట్లను అభినందించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రవీంద్రాచారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి భిక్షపతి, గుండా రాజు, ముద్దసాని ప్రమోద్‌కుమా ర్, గంగాధర్, శరత్‌బాబు, రామస్వామి, రమణారెడ్డి, తా నిపర్తి గోపాల్‌రావు, రాజేందర్, సారయ్య, కోలేటి శ్రీనివాస్, సత్యనారాయణ, తిరుపతిగౌడ్ ఉన్నారు. అ లాగే లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని శతాబ్ది ఆధ్వర్యం లో వైద్యుల దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ కంది శ్రీనివాస్‌రెడ్డితోపాటు మరో ముగ్గురు వైద్యులను ఘనంగా సన్మానించారు. క్లబ్ అధ్యక్షుడు చెరుకు బుచ్చిరెడ్డి ఆధ్వర్యం లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి, కిషన్‌రావు, అమరేశ్వర్‌రావు, ముకుంద్‌రెడ్డి, రమణారెడ్డి, శ్రీనివాస్‌రావు, జగన్మోహన్‌రెడ్డి, హరీశ్‌కుమార్, మోహన్‌రావు, రామకృష్ణ ఉన్నారు. 

జ్యోతినగర్: టౌన్‌షిప్‌లోని ఎన్టీపీసీ దవాఖానలో డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీపీసీ ఈడీ రాజ్‌కుమార్, రామగుండం మేయర్ డాక్టర్ అనిల్‌కుమార్ వేడుకకు హాజరై దవాఖాన వైద్యుల సమ క్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం ఈడీ వైద్యులను శాలువాలతో సన్మానించారు. ఇక్కడ జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ప్రమోద్, జిల్లా డిప్యూటీ మెడికల్ ఆఫీసర్ కృపాబాయి, శ్రీరామ్, ఎన్టీపీసీ దవాఖాన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సశ్మిత డ్యాష్, వైద్యులు దామెర అనిల్, జీవన లత, స్టాప్ నర్సులున్నారు.