శుక్రవారం 27 నవంబర్ 2020
Peddapalli - Jul 01, 2020 , 03:27:58

కష్టకాలంలో ఉత్తమ వైద్య సేవలు

కష్టకాలంలో ఉత్తమ వైద్య సేవలు

  • n కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌
  • n డీఎంహెచ్‌వో ఉద్యోగ విరమణ
  • n ఘనంగా సన్మానం

పెద్దపల్లిరూరల్‌: డీఎంహెచ్‌వో సుధాకర్‌ కరోనా కష్టకాలంలో ఉత్తమ వైద్యసేవలను ప్రజలకు అందించారని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ కొనియాడారు. జిల్లా ఉద్యోగుల సం ఘం ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి డీఎంహెచ్‌వోను కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, జిల్లా అధికారులు పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అలాగే జిల్లా కేంద్రంలోని అమర్‌చంద్‌ కల్యాణ మండపంలో సోమవారం రాత్రి జరిగిన సన్మాన కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ కార్యాలయ అధికారులు, సిబ్బంది డీఎంహెచ్‌వో దంపతులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్వో నర్సింహమూర్తి, పెద్దపల్లి ఆర్డీవో శంకర్‌ కుమార్‌, డీఎంహెచ్‌వో ప్రమోద్‌ కుమార్‌, డీఆర్డీవో వినోద్‌, డీపీవో వేముల సుదర్శన్‌, జిల్లా సహకార అధికారి చంద్రప్రకాశ్‌రెడ్డి, డీఎఫ్‌వో  రవిప్రసాద్‌ యాదవ్‌, జిల్లా పౌర సరఫరాల అధికారి తోట వెంకటేశం, జిల్లా మార్కెటింగ్‌ అధికారి ప్రవీణ్‌ రెడ్డి, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రాజన్న, జిల్లామత్స్య శాఖ అధికారి మల్లేశం, తహసీల్దార్లు జోగినపల్లి అనుపమారావు, సుమలత, డీపీఆర్వో శ్రీధర్‌ తదితరులున్నారు.