సోమవారం 06 జూలై 2020
Peddapalli - Jun 30, 2020 , 02:35:40

మల్లన్నపల్లిలో పురాతన రాతి విగ్రహాలు

మల్లన్నపల్లిలో పురాతన రాతి విగ్రహాలు

  • n దుక్కిదున్నుతుండగా బయటపడ్డ దేవతాముర్తుల ప్రతిమలు 

చొప్పదండి: మండలంలోని మల్లన్నపల్లి గ్రామం లో పురాతన రాతి విగ్రహాలు బయల్పడ్డాయి. గోదావరి శంకరయ్య అనే రైతు పొలంలో సోమవారం దుక్కి దున్నుతుండగా నాగలికి తట్టాయి. వీటిపై సీతారామచంద్రస్వామితో పాటు లక్ష్మణుడి రూపాలు చెక్కి ఉన్నాయి.  శంకరయ్య ఆశ్చ ర్యానికి గురై సమీపంలోని రైతులకు సమాచా రమిచ్చాడు. వారు అక్కడికి చేరుకొని ఎంపీటీసీ కట్టెకోల తారకు తెలియజేశారు. ఆమె అక్కడికి వచ్చి విగ్రహాలను పరిశీలించారు.  సర్పంచ్ లింగంపెల్లి లావణ్య, ఉప సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచు గన్ను శ్రీనివాస్ విగ్రహాలను సందర్శించి వివరాలు సేకరించారు. కాగా బయటపడ్డ దేవతల ప్రతిమలకు పలువురు పూజలు చేశారు.logo