గురువారం 26 నవంబర్ 2020
Peddapalli - Jun 30, 2020 , 02:35:54

రేపు పాలీసెట్

రేపు పాలీసెట్

  • n జిల్లాలో ఏడు పరీక్షా కేంద్రాలు
  • n ఉదయం 11 గంటలకు ప్రారంభం
  • n హాజరుకానున్న 1800 మంది విద్యార్థులు
  • n మాస్కులు తప్పనిసరిగా ధరించాలి

సీసీసీ నస్పూర్: పాలీసెట్-2020 పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంచిర్యాల జిల్లా పాలీసెట్ కోఆర్డినేటర్, సీసీసీ నస్పూర్ సింగరేణి పాలీటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. జూలై 1వ తేదీన ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు పరీక్ష ఉంటుందని, ఇందుకు జిల్లాలో 7 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సాయికుంట ప్రభుత్వ పాఠశాల, గర్మిళ్ల ప్రభుత్వ పాఠశాల, జడ్పీ బాలుర, జడ్పీ బాలికల పాఠశాలపాటు సీసీసీ సింగరేణి పాలీటెక్నిక్ కళాశాలలో రెండు సెంటర్లు ఏర్పాటు చేశామని వివరించారు. 1800 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు ఆయన వెల్లడించారు. గంట ముందు కేంద్రానికి రావాలని, మాస్కు తప్పసరిగా ధరించాలన్నారు. హాల్ టికెట్, పరీక్షా సామగ్రి వెంట తెచ్చుకోవాలని సూచించారు.

బెల్లంపల్లిలో..

బెల్లంపల్లి టౌన్: పట్టణంలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్, కోఆర్డినేటర్ రవీందర్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాలీటెక్నిక్ కళాశాల, జిల్లా పరిషత్ బజార్ ఏరియా పాఠశాల, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలల్లో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొత్తం 946 మంది పరీక్షకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకు కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు. మాస్కులు ధరించి మంచినీటి బాటిల్‌తో హాజరు కావాలని సూచించారు. పరీక్షకు హాజరయ్యే ప్రతి విద్యార్థి చేతులను శానిటైజర్ చేసిన తర్వాతనే కేంద్రంలోని అనుమతిస్తామన్నారు. భౌతిక దూరం పాటిస్తూ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు.