గురువారం 03 డిసెంబర్ 2020
Peddapalli - Jun 29, 2020 , 01:17:30

దేశ ఆర్థిక వ్వవస్థను గాడిలో పెట్టారు...

దేశ ఆర్థిక వ్వవస్థను గాడిలో పెట్టారు...

పెద్దపల్లి రూరల్‌: జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆధ్వర్యంలో పీవీ నరసింహారావు శత జ యంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్‌, అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భం గా కలెక్టర్‌ మాట్లాడుతూ, దేశ ఆర్థిక వ్వవస్థను గాడిలో పెట్టారని పేర్కొన్నారు. దేశానికే వన్నెతెచ్చిన పీవీ నరసింహారావు లాంటి మహోన్నత వ్యక్తుల ఆశయాలను కొనసాగించాలని కోరా రు. పీవీ శత జయంతి ఉత్సవాలను అధికారికం గా నిర్వహిస్తుండడం సంతోషకరమన్నారు.

మహనీయుడు పీవీ :  ఎమ్మెల్యే దాసరి  

పీవీ నరసింహారావు మహనీయుడని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని మంథని నుంచి ఎమ్మెల్యేగా రాజకీయ జీవితాన్ని ఆరంభించి దేశ ప్రధాని స్థాయికి ఎదగడం మనందరికీ గర్వకారణమన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో వివిధ శాఖల మంత్రిగా పని చేసి వాటికి వన్నె తెచ్చారని కొనియాడారు. ప్రధానిగా పీవీ అందించిన సేవల మాదిరిగానే సీఎం కేసీఆర్‌ పేదవర్గాలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. పీవీ శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం శుభపరిణామమన్నారు.

మహోన్నత వ్యక్తి: ఎమ్మెల్యే చందర్‌

కరీంనగర్‌ జిల్లా వాసిగా మహోన్నత స్థానాన్ని అధిష్టించి దేశానికే వన్నె తెచ్చే విధంగా సంస్కరణలు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి పీవీ నరసింహారావు అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు. మంథని నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన పీవీ మంత్రిగా, ముఖ్యమంత్రిగా  గుర్తు చేశారు.  గోదావరిఖనిలో పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుకంటి మంత్రిని కోరగా, కొప్పుల ఈశ్వర్‌ స్పందిస్తూ జిల్లాకేంద్రంతో పాటు ప్రధాన కూడళ్లలో పీవీ కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వీ లక్ష్మీనారాయణ, ఇన్‌చార్జి డీఆర్వో కే నర్సింహమూర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జీ రఘువీర్‌సింగ్‌, రామగుండం మేయర్‌ డాక్టర్‌ బింగి అనిల్‌కుమార్‌, పెద్దపల్లి జోన్‌ డీసీపీ పులిగిళ్ల రవీందర్‌. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వినోద్‌, జిల్లా పంచాయతీ అధికారి వేముల సుదర్శన్‌, జిల్లా సంక్షేమాధికారి అక్కేశ్వర్‌రావు, ఇంటర్‌ బోర్డ్‌ నోడల్‌ అధికారి కల్పన, కలెక్టర్‌ కార్యాలయ ఏవో కేవైకే ప్రసాద్‌, పెద్దపల్లి తహసీల్దార్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

పీవీ సేవలు మరువలేనివని 

పెద్దపల్లి కల్చరల్‌: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలు మరువలేనివని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గ్రంథాల య కార్యాలయంలో పీవీ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువీర్‌సింగ్‌ పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, స్వీట్లు పంచారు. అనంతరం మాట్లాడుతూ, పీవీ రాజకీయాల్లో చెరగని ముద్రవేసుకున్నారని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారని కొనియాడారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది ఎండీ గఫార్‌, యూనస్‌ ఖాద్రీ, సీహెచ్‌ రమేశ్‌, ప్రేమ్‌కుమార్‌, పాఠకులు రమేశ్‌, సతీశ్‌, జగన్‌, షాహిద్‌, అహ్మద్‌, రమేశ్‌ పాల్గొన్నారు. 

జూలపల్లి: మండల ప్రజాపరిషత్‌ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీపీ కూసుకుం ట్ల రమాదేవి పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురికి స్వీట్లు పంచి పెట్టారు. అలాగే పాత బస్టాండు వద్ద జాగృతి  కన్వీనర్‌ సంగ్రామ్‌సింగ్‌, నియోజక వర్గ కన్వీనర్‌ కోడూరి మహేశ్‌ పీవీ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు దారబోయిన నరసింహం, వైస్‌ ఎంపీపీ మొగురం రమేశ్‌, కో ఆప్షన్‌ సభ్యుడు లాల్‌మహ్మద్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పాటకుల అనిల్‌, జిల్లా కుర్మ సంఘం అధ్యక్షుడు పొట్టాల మల్లేశం, నాయకులు బోడ సంపత్‌రెడ్డి, మామిడిపెల్లి చంద్రశేఖర్‌, కూసుకుంట్ల రాంగోపాల్‌రెడ్డి, నాడెం మల్లారెడ్డి, మానుమండ్ల సంపత్‌, నూతి మల్లయ్య, తాటిపెల్లి రాయలింగం తదితరులు పాల్గొన్నారు.

ఎలిగేడు: మండలకేంద్రంలో నిర్వహించిన వేడుక ల్లో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  ఇక్కడ వైస్‌ ఎంపీపీ బుర్ర వీరస్వామిగౌడ్‌, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మాడ కొండల్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ సబ్బు శ్రీధర్‌, నాయకులు చలెందు ల చంద్రశేఖర్‌, తాటిపెల్లి సతీశ్‌బాబు, మూసల మనోహర్‌రెడ్డి, తిరుపతి, కుడుదుల నరేశ్‌, నాగరాజు, రాకేశ్‌, వెంకటేశ్‌, సంపత్‌, శ్రీనివాస్‌, అరు ణ్‌, అభిలాష్‌, మహేశ్‌, స్వామి పాల్గొన్నారు.

పెద్దపల్లి టౌన్‌: జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో డీటీవో ఆఫ్రిన్‌ సిద్ధిఖీ పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇక్కడ ఎంవీఐ శ్రీనివాస్‌, ఏఎంవీఐ నాగలక్ష్మి, సూపరింటెండెంట్‌ ధర్మరాజు, సిబ్బంది ఉన్నారు.