బుధవారం 02 డిసెంబర్ 2020
Peddapalli - Jun 28, 2020 , 02:59:26

లక్ష్యసాధన దిశగా ముందుకు..

లక్ష్యసాధన దిశగా ముందుకు..

  •  కలెక్టర్ సిక్తా పట్నాయక్
  •  కొనసాగుతున్న హరితహారం
  •  మొక్కలు నాటిన అధికారులు, ప్రజాప్రతినిధులు

పెద్దపల్లి రూరల్: ఆరో విడుత హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం లక్ష్యసాధన దిశగా ముందుకుసాగుతున్నదని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆమె, అదనపు కలెక్టర్ కలిసి శనివారం మొక్కలు నాటి నీళ్లు పోసి ట్రీ గార్డులను ఏర్పాటు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ఈ నెల 25న ప్రారంభమైన హరితహారం జిల్లాలో ఉద్యమంలా కొనసాగుతున్నదని వివరించారు. జిల్లా స్థాయి అధికారులంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ హరితహారం విజయవంతమయ్యేలా కృషి చేస్తున్నారని తెలిపా రు. వాతావరణ కాలుష్యం నివారణ, స్వచ్ఛమైన గాలి కోసం, వర్షాలు సమృద్ధిగా కురిసేందుకు ప్రజలందరూ మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. హరితహారంలో నాటిన మొక్కలను రక్షించే బాధ్యతలను గ్రామస్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో హరితహారాన్ని విజయవంతం చేయాలని, ఎక్కడ చూసినా పచ్చదనం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. హరితహారం దిగ్విజయంగా కొనసాగేలా అధికారులు కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఇన్ డీఆర్వో నర్సింహమూర్తి, కలెక్టర్ కార్యాలయ ఏవో కేవైకే ప్రసాద్, డీఎఫ్ రవిప్రసాద్ యాదవ్, జిల్లా పౌర సరఫరాల అధికారి తోట వెంక టేశం, డీపీఆర్వో శ్రీధర్, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

ప్రతి పీఎస్ హరితహారం 

ఫెర్టిలైజర్ జిల్లాలోని అన్ని పోలీస్ (పీఎస్)లో హరితహారం నిర్వహిస్తామని సీపీ సత్యనారాయణ తెలి పారు. హరితహారంలో భాగంగా రామగుండం పోలీస్ కమి షనరేట్ కార్యాలయ ఆవరణలో సీపీ మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడారు.  అందరూ తమ పుట్టిన రోజున మొక్కలు నాటాలని పిలుపు నిచ్చారు. అనంతరం పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పోలీస్ పరిసరాలు ఆహ్లాదకరంగా ఉండేందుకు కమిషనరేట్ ప్రతి పోలీస్ మొక్కలు నాటు తామని వివరించారు. కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ రవీందర్, డీసీపీ అడ్మిన్ అశోక్ కుమార్, ఏఆర్ అడిషనల్ డీసీపీ సంజీవ్, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, రామగుండం సీఐ కరుణాకర్ రావు, సీసీఎస్ ఇన్ వెంకటేశ్వర్, సీపీవో ఏవో ఫర్హానా, ఆర్ మధుకర్, శ్రీధర్, ఎన్టీపీసీ ఎస్ ఉమాసాగర్, ఆర్ సంతోష్, ఏఎస్ పురుషోత్తం తదితరులున్నారు. అనంతరం రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ ఇన్ రమేశ్ ఆధ్వర్యంలో హరితహారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా పండ్లు, పూల జాతి మొక్కలను నాటారు.  ఇక్కడ ఎస్ నాగరాజు, కమలాకర్, ఏఎస్ స్వామి, కానిస్టేబుల్ సత్యనారాయణ, మల్లప్ప, శ్రీను, సంజీవ్, సత్యనా రాయణ తదితరులు ఉన్నారు.

హరితహారం సామాజిక బాధ్యత 

ఎలిగేడు : ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం చేపడుతున్న ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా సహకరించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ కోరారు. నారాయణపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం గ్రామస్తులకు మొక్కలు అందజేసి పచ్చదనం ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్ పర్సన్ మండిగ రేణుక, వైస్ ఎంపీపీ బుర్ర వీరస్వామిగౌడ్, సర్పంచ్ మాడ కొండల్ ఎలిగేడు సింగిల్ విండో చైర్మన్ గోపు విజయభాస్కర్ వైస్ చైర్మన్ చింతిరెడ్డి గణపతిరెడ్డి, ఉప సర్పంచ్ సబ్బు శ్రీధర్, మండల ప్రత్యేకాధికారి తిరుపతి రావు, తహసీల్దార్ పద్మావతి, ఎంపీడీవో శ్రీనివాసమూర్తి, ఎంపీవో అనిల్ ఏపీఎం సుధాకర్, టీఆర్ పార్టీ మండల శాఖఅధ్యక్షుడు బైరెడ్డి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మొక్కలను నాటాలి.. సంరక్షించాలి

పెద్దపల్లి జంక్షన్: ఆరో విడుత హరితహారంలో భాగంగా మండలంలో దాదాపు 6లక్షల మొక్కలను నాటనున్నట్లు ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్ తెలిపారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో సబ్బితంలో మొక్కలను పెంచుతున్న నర్సరీని పరిశీలించారు. గ్రామ పరిధిలో కనీసం 30వేలకు తగ్గకుండా మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ సదయ్య, ఏపీవో మల్లేశ్వరి, వార్డు సభ్యులు, టీఆర్ నాయకులు పాల్గొన్నారు.

ఆరోగ్య తెలంగాణ అందరి కర్తవ్యం 

జూలపల్లి : ఆరోగ్య తెలంగాణ అందరి కర్తవ్యంగా భావించి పచ్చదనం పెంపునకు కృషి చేయాలని ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి సూచించారు. కాచాపూర్  ఎంపీపీ గ్రామస్తులకు పూల మొక్కలు పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణలో పండ్లు, పూలు, ఔషధ మొక్కలు విరివిగా నాటుకొని పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఆకు పచ్చని తెలంగాణ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బంటు ఎల్లయ్య, పంచాయతీ కార్యదర్శి శరత్, వీఆర్వో రాజయ్య తదితరులు పాల్గొన్నారు.