శుక్రవారం 27 నవంబర్ 2020
Peddapalli - Jun 28, 2020 , 02:59:35

సంక్షేమానికి సర్కారు పెద్దపీట

సంక్షేమానికి సర్కారు పెద్దపీట

  • l రోళ్లవాగు ఆధునీకరణతో  30 వేల ఎకరాలకు సాగునీరు
  • l ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
  • l బీర్ మండలం తాళ్లధర్మారంలో చెక్ నిర్మాణానికి భూమి పూజ
  • l గోదావరిఖనిలో టీఆర్ ఇద్దరు బీజేపీ కార్పొరేటర్లు
  • l వారితో పాటే 300 మంది అనుచరులు
  • l కండువా కప్పి ఆహ్వానించిన అమాత్యుడు

సారంగాపూర్ : రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. శనివారం బీర్ మండలం తాళ్లధర్మారం గ్రామ శివారులోని ఒర్రెమాటువాగు వద్ద రూ.2.24 కోట్లతో చెక్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రతి చెరువుకూ నీరు చేరేలా సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని తెలిపారు. మండలంలోని ఒక టీఎంసీ సామర్థ్యంతో రోళ్లవాగు ప్రాజెక్ట్ ఆధునీకరించడానికి అప్పటి ఎంపీ కల్వకుంట్ల కవిత సహకారంతో సీఎం దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వం రూ.63 కోట్లు మంజూరు చేసిందన్నారు. ప్రాజెక్ట్ పనులు పూర్తయితే బీర్ మండలంలోని 15 వేల ఎకరాలకు, ధర్మపురి మండలంలోని 15 వేల ఎకరాలకు సాగు, తాగు నీరు అందుతుందన్నారు. తమకు గోదావరి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేయాలని, నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితుల భూముల కోసం విద్యుత్ మోటర్లు అందించాలని గ్రామ సర్పంచ్ నల్ల మైపాల్ కోరగా.. మోటర్లు, విద్యుత్ సౌకర్యం కోసం దరఖాస్తులు చేసుకోవాలని మంత్రి సూచించారు. ఎమ్మెల్యే కోటా నుంచి డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని సంజయ్ కుమార్ కోరారు. అనంతరం అటవీ ప్రాంతంలో మంత్రి మొక్కలను నాటారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా భూసమస్యలున్నాయని, సీఎం చొరవతో సాగు చేసుకుంటున్న వెయ్యి ఎకరాల భూములకు పట్టాలు ఇచ్చినట్లు చెప్పారు. పోతారంలో 40 ఏళ్ల తర్వాత రైతులకు పాసుపుస్తకాలు  వచ్చాయన్నారు. జిల్లా కలెక్టర్ రవి మాట్లాడుతూ రైతులు వాగులకు విద్యుత్ మోటర్లు ఏర్పాటు చేసుకుని సాగు చేసుకుంటున్నారని, చెక్ డ్యాం నిర్మాణంతో వెయ్యి ఎకరాలకు లబ్ధి జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ దావ వసంత, ఆర్డీవో మాధురి, ఎంపీపీ మసర్తి రమేశ్, జడ్పీ సభ్యురాలు పాత పద్మ, కేడీసీసీబీ డైరెక్ట్ ముప్పాల రాంచందర్ రైతుబంధు సమితి జిల్లా సభ్యులు కొల్ముల రమణ, గుర్రాల రాజేందర్ ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

టీఆర్ ఇద్దరు బీజేపీ కార్పొరేటర్లు 

గోదావరిఖని టౌన్ : రామగుండం నగరపాలక సంస్థ 43వ డివిజన్ కార్పొరేటర్ ధరణి స్వరూప, 48వ డివిజన్ కార్పొరేట ర్ పొన్నం విద్య బీజేపీ నుంచి టీఆర్ చేరారు. వారికి మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితోపాటు దాదాపు 300 మంది కార్యకర్తలు చేరారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సభాధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ గడిచిన ఆరేళ్లలో తె లంగాణ రూపురేఖలు మారాయని, ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ ముందంజలో ఉందన్నారు. టీఆర్ చేరడానికి జాతీయస్థాయి నాయకులు సైతం ఎదురుచూస్తున్నారని, రా ష్ట్రంలో టీఆర్ తప్ప రెండోపార్టీకి అవకాశం లేదని, ఇది ప్ర జలు నిరూపిస్తున్నారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ చేరిన వారిని అభినందించారు. ఇక్కడ మేయర్ డాక్టర్ బంగి అనిల్ డిప్యూటీ మేయర్ అభిషేక్ కార్పొరేటర్లు, టీఆర్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.