సోమవారం 23 నవంబర్ 2020
Peddapalli - Jun 27, 2020 , 02:24:00

‘కార్పొరేట్‌ శక్తులకు బొగ్గు బ్లాకులు’

‘కార్పొరేట్‌ శక్తులకు బొగ్గు బ్లాకులు’

రామగిరి: ప్రధాని కరోనా ప్యాకేజీ పేరుతో దేశంలోని 41 బొగ్గు బ్లాకులను వేలం ద్వారా ప్రైవేటు కార్పొరేట్‌ శక్తులకు అప్పగిస్తున్నారంటూ ఆర్జీ-3 పరిధి లోని గనులు, అడ్రియాల ప్రాజెక్టులో టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ ను దహనం చేశారు. ఏఎల్‌పీ ప్రాజెక్టులో దాసరి మల్లేశ్‌ అధ్యక్షతన చేపట్టిన కార్యక్రమంలో టీబీజీకేఎస్‌ నాయకులు గౌతం శంకరయ్య,  సుద్దాల తిరుపతి, వీవీ గౌడ్‌, కొండపర్తి తిరుపతి, కే శ్రీనివాస్‌, సత్యనారాయణ రెడ్డి పాల్గొనగా, ఓసీపీ-2లో పిట్‌ సెక్రటరీ రవిశంకర్‌ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమాల్లో పర్స బక్కయ్య, పెర్కారి నాగేశ్వర రావు, మామిడి స్వామి, డీ శ్రీనివాస్‌, ఉప్పు వెంకటేశ్వర్లు, రహీమొద్దీన్‌ ఉన్నారు. అలాగే ఓసీపీ-1బేస్‌ వర్క్‌ షాపు, సీహెచ్‌పీలో పిట్‌ సెక్రటరీ జైపాల్‌ రెడ్డి ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దహనం చేయగా, ఇక్కడ నాయకులు లింగారెడ్డి, కాంతాల కిషన్‌ రెడ్డి, ఈసంపల్లి రమేశ్‌, సంపత్‌ రెడ్డి, మహిపాల్‌, కండె రాజన్న తదితరులు ఉన్నారు. 

యైటింక్లయిన్‌ కాలనీ: ఆర్జీ-2లోని గనులు, డిపార్ట్‌మెంట్లలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు.  కార్యక్రమాల్లో నాయకులు దేవ వెంకటేశం, కొత్త సత్యనారాయణ రెడ్డి, చెరుకు ప్రభాకర్‌ రెడ్డి, శంకర్‌ నాయక్‌, సత్యనారాయణ, బానాకర్‌, శ్రీనివాస్‌రెడ్డి, ప్యారేమియా, బేత చంద్రయ్య, హరి ప్రసాద్‌, రవీందర్‌ రెడ్డి, ఆవునూరి రాజేశం, అక్రమ్‌, సురేందర్‌, కొంరయ్య, పైడిపల్లి ప్రభాకర్‌, కర్క శ్రీనివాస్‌, బాలయ్య, మల్లేశ్వర రావు, శ్రీకాంత్‌, రవీందర్‌, స్వామి, సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

గోదావరిఖని : ఆర్జీ-1 పరిధిలోని గనులపై కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. జీడీకే-11 గనిపై గేట్‌ మీటింగుకు టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు బీ వెంకట్రావ్‌ హాజరయ్యారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్‌ ఆర్జీ-1 ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్‌రావు, కనకం శ్యాంసన్‌, జావిద్‌పాషా, ఎట్టం క్రిష్ణ, ఎల్‌ వెంకటేశ్‌,  సత్యనారాయణ,  వెంకటేశం,నాయిని శంకర్‌, గుమ్మడి లింగయ్య, సప్పిడి రామస్వామి, సత్యనారా యణరెడ్డి, దుర్గం తిరుపతి, దాసారపు కుమార్‌,  శ్రీనివాస్‌, చంద్రమౌళి పాల్గొ న్నారు. జీడీకే-2 గనిపై కార్యక్రమంలో పిట్‌ సెక్రటరీ లక్కాకుల లక్ష్మణ్‌, టీబీజీకేఎస్‌ కేంద్ర డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ జావిద్‌పాషా, దాసరి నర్సయ్య, రవి, శేషగిరి, జునగరి రమేశ్‌, సాయికుమార్‌, సతీశ్‌, వెంకటరాంరెడ్డి పాల్గొన్నారు.  

బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ ఎదుట శుక్ర వారం కేంద్రం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమానికి టీబీజీ కేఎస్‌ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి హాజరై మాట్లాడారు.