గురువారం 26 నవంబర్ 2020
Peddapalli - Jun 27, 2020 , 02:23:56

సమ్మెను విజయవంతం చేయండి

సమ్మెను విజయవంతం చేయండి

  • గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు వెంకట్రావ్‌ 

గోదావరిఖని,నమస్తే తెలంగాణ : కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో వచ్చే నెల 2వ తేదీన నిర్వహించనున్న 24గంటల సమ్మెను కార్మికులు విజయవంతం చేయాలని సంఘం అధ్యక్షుడు వెంకట్రావ్‌ పిలుపునిచ్చారు. గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన మాట్లాడారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులపై కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలియజేశామని వివరించారు. అన్ని ఏరియాల్లో కార్మికులను కలిసి సమ్మె విజయవంతం చేయాలని కోరుతామని చెప్పారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేయమని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారని గుర్తు చేశారు. కేంద్రం బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణతో సింగరేణికి ఇబ్బందులు ఉంటాయన్నారు. ఈ కారణంగానే తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. జాతీయ కార్మిక సంఘాలు 3 రోజుల పాటు సమ్మె చేయాలని పిలుపునిచ్చాయని, తాము మాత్రం ఒక్క రోజు సమ్మె చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై రానున్న రోజుల్లో అవసరమైతే నిరవధిక సమ్మెకు వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. సమావేశంలో నాయకులు దేవ వెంకటేశం, కనకం శ్యాంసన్‌, గండ్ర దామోదర్‌రావు, మండ రమేశ్‌, పుట్ట రమేశ్‌ ఉన్నారు.