బుధవారం 25 నవంబర్ 2020
Peddapalli - Jun 26, 2020 , 01:15:53

ప్రజలందరూ భాగస్వాములవ్వాలి

ప్రజలందరూ భాగస్వాములవ్వాలి

  • lరాష్ర్టాన్ని పచ్చని తోరణంగా మార్చేందుకే హరితహారం
  • lఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

జ్యోతినగర్‌/ధర్మపురి: రాష్ర్టాన్ని పచ్చని తోరణంగా మార్చేందుకే సీఎం కేసీఆర్‌ హరితహారం చేపట్టారని, అందరూ విధిగా మొక్కలు నాటి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పిలుపునిచ్చారు. ఆరో విడుత హరితహారంలో భాగంగా గురువారం ఎన్టీపీసీలోని ఐదో డివిజన్‌ మల్కాపూర్‌లో, జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేతకానితో కలిసి మంత్రి మొక్క నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ధర్మపురి పట్టణంలోని గోదావరి నది ఒడ్డున అల్లనేరేడు, ఉసిరి మొక్కలు నాటారు. అనంతరం మంత్రి ఈశ్వర్‌ ఆయా చోట్ల మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా 2015లో ప్రారంభించిన హరితహారం కార్యక్రమం విజయ వంతంగా నడుస్తున్నదన్నారు. ఆరో విడుతలో 30 కోట్లు నాటి వాటిని సంరక్షించేందుకు కృషి చేస్తామన్నారు. అడవుల పునరుద్ధరణకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని, జిల్లాలోని మున్సిపాలిటీల్లో మియావాకి విధానంతో చిట్టడవులను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నదన్నారు. గ్రామ పంచాయతీల పరిధిలో ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు అందిస్తామన్నారు. ఎంపీ వెంకటేశ్‌ నేతకాని మాట్లాడుతూ.. పర్యావరణ సమతౌల్యత కాపాడేందుకు సీఎం కేసీఆర్‌ చేపట్టిన హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పి లుపునిచ్చారు. అనంతరం మంత్రితో పాటు ఎంపీ వెంకటేశ్‌ నేతకాని, ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమ న్‌,  కలెక్టర్లు రవి, సిక్తా పట్నాయక్‌, ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, మేయర్‌ బింగి అనిల్‌కుమార్‌, డీసీఎమ్మెస్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ కమిషనర్‌ వీ సత్యనారాయణ, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావు, కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌, జిల్లా అటవీ శాఖ అధికారి రవికుమార్‌, ఏరియా ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ రహ్మతు ల్లా, రామగుండం తహసీల్దార్‌ టీ రవీందర్‌, అంతర్గాం జడ్పీటీసీ ఆముల నారాయణ, కార్పొరేటర్లు ఉన్నారు.