బుధవారం 25 నవంబర్ 2020
Peddapalli - Jun 25, 2020 , 02:13:53

వైకుంఠధామాల నిర్మాణ పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలి

వైకుంఠధామాల నిర్మాణ పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలి

సుల్తానాబాద్‌రూరల్‌: గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణ పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆదేశించారు. సుల్తానాబాద్‌ మండలం సాంబయ్యపల్లి, గర్రెపల్లిల్లో బుధవారం ఆమె పర్యటించారు. ఆయా గ్రామాల్లో కంపోస్టు షెడ్‌, వైకుంఠధామ నిర్మాణ పనులతోపాటు నర్సరీని పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో హరితహారం ప్రారంభించనున్నామని వివరించారు. 10 శాతం గ్రీన్‌ బడ్జెట్‌ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సూచించారు. కరోనా కారణంగా ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలాభివృద్ధికి నిధులను విడుదల చేస్తున్నదని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతు లు కల్పించేందుకు సీఎం కేసీఆర్‌ అత్యధిక ప్రా ధాన్యం ఇస్తున్నారని వివరించారు. గ్రామాల్లో రో జూ పారిశుద్ధ్య పనులను చేయించాలని, నిర్లక్ష్యం వహిస్తే సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో నూ తన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ఏర్పాటు చేసిన స్టాండింగ్‌ కమిటీలు, ప్రజాప్రతినిధులు, ప్రజలను హరితహారంలో భాగస్వామ్యం చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీలకు ప్రతినెలా నిధులు విడుదలవుతున్న క్రమంలో సిబ్బంది వేతనాలు, విద్యుత్‌ బిల్లులు, రుణాల చెల్లింపులు పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో డంపింగ్‌యార్డుల నిర్మాణం పూర్తి చేశామని, ట్రాక్టర్ల కొనుగోలు ప్రక్రియ ముగిసిందని కలెక్టర్‌కు అధికారులు వివరించారు. ట్రాక్టర్లతోపాటు ట్రాలీలు, ట్యాంకర్లు త్వరగా సమకూర్చుకోవాలని, వైకుంఠధామాల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. వైకుంఠధామాల వద్ద మహిళలు, పురుషులు వేర్వేరుగా స్నానాలు చేసేలా ఏర్పాట్లు చే యాలని సూచించారు. గ్రామాల్లో కొనసాగుతున్న పనులపై నిఘా వర్గాల ద్వారా సీఎం సమాచారం సేకరిస్తున్నారని, ప్రతి చిన్న అంశంపైనా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రతి గ్రామ పం చాయతీ పరిధిలో ఎకరం స్థలంలో మూడు వరుసల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తూ పార్క్‌ను ఏర్పాటు చేయాలని, కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఉపాధిహామీ కింద చేపట్టిన ఎస్సారెస్పీ కాలువలు, నీటి పారుదల శాఖ మైనర్‌ కాలువల మరమ్మతు పనులను వచ్చేనెల 31 తేదీ దాకా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రాజన్న, ఎంపీడీవో సంతోష్‌కుమార్‌, తహసీల్దార్‌ హన్మంతరావు, ఎంపీపీ బాలాజీరావు, జడ్పీటీసీ మినుపాల స్వరూపాపాణి, సర్పంచులు వీరగోని, బాపిరెడ్డి, ఎంపీటీసీలు పులి అనూష, గట్టు శ్రీనివాస్‌, ఉప సర్పంచ్‌ మధూకర్‌, నాయకులు వీరగోని రమేశ్‌గౌడ్‌, వడ్కాపూరం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.