మంగళవారం 01 డిసెంబర్ 2020
Peddapalli - Jun 25, 2020 , 02:09:39

ఉద్యమంలా మొక్కలు నాటే కార్యక్రమం

ఉద్యమంలా మొక్కలు నాటే కార్యక్రమం

మంథని టౌన్‌: మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఉద్యమంలా నిర్వహించాలని మం థని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ పిలుపునిచ్చారు. గురువారం ప్రారంభమయ్యే ఆరో విడుత హరితహారం కార్యక్రమానికి పట్టణంలోని అంబేద్కర్‌ చెరువు కట్ట వద్ద గుంతల తవ్వే పనులను బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణను హరిత వనంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ అత్యంత  ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మొక్కలు నాటడంతోపాటు సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె వెంట మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అరెపల్లి కుమార్‌, మున్సిపల్‌ సిబ్బంది ఉన్నారు. 

సర్వం సిద్ధం 

ముత్తారం: ఆరో విడుత హరితహారం నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో 14 నర్సరీలు ఏర్పాటు చేశారు. ఆయా నర్సరీల్లో మొత్తం 3 లక్షల మొ క్క లు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి. మండలంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో పోతారంలో ఏర్పాటు చేసిన నర్సరీలో అటవీ జాతి మొక్కలు లక్ష పెం చారు. హరిపురం నర్సరీలో 25 వేల మొక్కలు సిద్ధంగా ఉంచగా, అటవీ జాతి మొక్కలు 15 వేలు, రోడ్డుకు ఇరువైపులా నాటేందుకు 10వేల మొక్కలు అందుబాటులో ఉంచారు. మండలంలోని ఆయా గ్రామపంచాయతీల్లో మునగ, కృష్ణతులసి, వేప, గోరింటాకు, ఉసిరి, కానుగ, జామ, బొప్పాయి, చింత, తదితర మొక్కలు సిద్ధంగా ఉంచారు. ఆలయాలు, మసీదులు, పాఠశాలలు, రోడ్ల వెంట, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలను నాటేందుకు అధికారులు  ఏర్పాట్లు చేస్తున్నారు. ఆసక్తి ఉన్న రైతులకు టేకు మొక్కలను కూడా అందించనున్నారు. 

విజయవంతం చేయాలి

హరితహారంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీడీవో మంత్రి మణికంటేశ్‌ కోరారు. మొక్కలు నాటేందకు గుంతలు తీశామని వివరించారు.

ముత్తారం మండలంలోని కేశనపల్లి, పోతారం లో హరితహారం ప్రారంభించనున్నట్లు ఎంపీపీ జక్కుల ముత్తయ్య ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, ఆర్‌బీఎస్‌ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీపీ కోరారు. 

మొక్కలు నాటి సంరక్షించాలి

ధర్మారం: హరిత హారంలో భాగంగా ధర్మారంలోని దుకాణాల ఎదుట నాటిన ప్రతి మొక్కనూ వ్యాపారులు సంరక్షించాలని ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ కోరారు. హరితహారంపై ధర్మారంలోని వ్యాపారులతో మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, హరితహారం కార్యక్రమంలో వ్యాపారులు భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంపీడీవో జయశీల, ఈజీఎస్‌ ఏపీవో రవి, ఏఎస్‌ఐ రవి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.