సోమవారం 30 నవంబర్ 2020
Peddapalli - Jun 24, 2020 , 02:01:22

తప్పుడు విమర్శలు మానుకోవాలి

తప్పుడు విమర్శలు మానుకోవాలి

  • టీఆర్‌ఎస్‌ నాయకులు

మంథని టౌన్‌: రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్‌ నాయకులు జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌పై విమర్శలకు దిగుతున్నారని విండో చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌, ఎంపీపీ కొండ శంకర్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కుంట శ్రీనివాస్‌ అన్నారు. పట్టణంలోని జడ్పీ చైర్మన్‌ నివాసంలో మంగళవారం వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈనెల16న కూచిరాజ్‌పల్లి గ్రామ శివారు లో ద్విచక్ర వాహనం లారీ ఢీకొన్న ఘటనలో ము గ్గురు మృతిచెందగా ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇసు క అక్రమ రవాణా జరుగుతుందని ఎమ్మెల్యే ఆరోపణలు చేయగా, ఇందుకు పుట్ట మధూకర్‌ స్పంది స్తూ అక్రమ ఇసుక రవాణాకు తావులేదని ఆధారాలతో సహా రుజువు చేశారని గుర్తుచేశారు. అలా గే జడ్పీ చైర్మన్‌ ప్రశ్నలకు ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు.  రైతులకు సంబంధించిన ధాన్యం లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొడితే దానిని రాజకీయం చేసేందుకు ఇసుక లారీ అని కాంగ్రెస్‌ నాయకులు ప్రచారం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ నాయకులే నేటికీ ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని, రెండు రోజుల క్రితం కాటారం మండలానికి చెందిన ఆ పార్టీ నాయకులు ఇసుకను అక్రమంగా తరలిస్తుం టే కమాన్‌పూర్‌ పోలీసులు పట్టుకోవడం నిజం కా దా..? అని ప్రశ్నించారు. జడ్పీ చైర్మన్‌ బంధువు అసైన్డ్‌ భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్నారని కాంగ్రెస్‌ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆ భూమికి పట్టా సైతం ఉందని చెప్పారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్‌ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మరోసారి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌పై విమర్శలకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆరెపల్లి కుమార్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు తగరం శంకర్‌లాల్‌, బత్తుల సత్యనారాయణ, ఆకుల కిరణ్‌, వేల్పుల గట్టయ్య, దిగంబర్‌, మాచీడి సత్యనారాయణగౌడ్‌ పాల్గొన్నారు.