బుధవారం 25 నవంబర్ 2020
Peddapalli - Jun 24, 2020 , 02:01:24

టాప్‌లో మంథని పీఏసీఎస్‌

టాప్‌లో మంథని పీఏసీఎస్‌

n  ఉమ్మడి జిల్లాలోనే  అత్యధికంగా ధాన్యం సేకరణ

n  పెరిగిన దిగుబడి

n  హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు 

ధాన్యం సేకరణలో మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనే టాప్‌లో నిలిచింది. మండలంలో 30 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 3,59,422క్వింటాళ్ల ధాన్యాన్ని 4236మంది రైతుల వద్ద నుంచి సేకరించింది. రైతులకు డబ్బుల చెల్లింపులోనూ ఆదర్శంగా నిలుస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుతో మంథని మండలం యాసంగిలో అధిక దిగుబడి సాధించి జిల్లాలోనే మూడో స్థానంలో నిలిచింది. - మంథని రూరల్‌ 

 కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి పరీవాహక ప్రాంతమైన మంథని మండలంలో రికార్డు స్థాయిలో ధా న్యం దిగుబడి వచ్చింది. పెద్దపల్లి జిల్లాలో అత్యధిక ధాన్యం దిగుబడిలో మూడోస్థానంలో నిలిచింది. గతంలో మంథని మండలంలో బోర్లు, బావులు ఉన్న రైతులు మాత్రమే యాసంగిలో వరి సాగు చేసేవారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి పరీవాహక ప్రాంతంలో నీటి వనరులు పుష్కలంగా ఉంటున్నాయి. దీంతో మండలంలో మొత్తం 20,102 ఎకరాల్లో రైతులు వరిని సాగు చేశారు. చివరి ఆయకట్టుకూ నీరందించేందుకు జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ చేసిన కృషి ఫలించింది.  

రికార్డు స్థాయిలో కొనుగోళ్లు

ధాన్యం సేకరణలోనూ మంథని పీఏసీఎస్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో టాప్‌లో నిలిచింది. మండలంలో ప్రభుత్వం పీఏసీఎస్‌ ఆధ్వర్యంలోనే 30కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేసింది. దీనిద్వారా 3,59,422క్వింటాళ్ల ధాన్యాన్ని 4236మంది రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసింది. గుంజపడుగులో 15,794క్వింటాళ్లు, పవర్‌హౌస్‌ కాలనీలో 32,929, పుట్టపాకలో 8667, నాగారంలో 9031, విలోచవరంలో 13,857, ఎక్లాస్‌పూర్‌లో 44,194, ఖానాపూర్‌లో 20,288, గోపాల్‌పూర్‌లో 15,100, నాగేపల్లిలో 14,767, వెంకటాపూర్‌లో 15,432, లక్కేపూర్‌లో 12,279, మహబూబ్‌పల్లిలో 8,588, శ్రీరాంనగర్‌లో 9,263, గుమ్మూనూరులో 4,139, అక్కెపల్లిలో 9,748, మల్లేపల్లిలో 6,701, నగరంపల్లిలో 7,797, ఆరెందలో 8,268, అడవిసోమన్‌పల్లిలో 9,596, గంగాపురిలో 14,518, గద్దలపల్లిలో 7,135, చిన్న ఓదాలలో 19,173, బిట్టుపల్లిలో 8,323, గాజులపల్లిలో 5,972, కాకర్లపల్లిలో 10,753, మైదుపల్లిలో 5,473, సిరిపురంలో 5,473, పెద్ద ఓదాలలో 4,187, సూరయ్యపల్లిలో 8,426 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించారు.  

డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో.. 

డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో మల్లారం, భట్టుపల్లి, కన్నాల, చిల్లపల్లి, ఉప్పట్ల, రచ్చపల్లి, స్వర్ణపల్లి, దుబ్బపల్లి, ఖాన్‌పాయిపేట గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ల ద్వారా మొత్తం 81,360క్వింటాళ్ల ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి సేకరించారు. మొత్తంగా మంథని మండలంలో ఈ యాసంగిలో 4,40,782క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది.  భారీ స్థాయిలో దిగుబడి రావడంతో రైతు లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు  రైతులకు వరం : జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌..

కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు వరంలా మారింది. ధాన్యం దిగుబడి పెరగడం హర్షణీయం. ధాన్యం కొనుగోళ్లలో మంథని పీఏసీఎస్‌ ఉమ్మడి జిల్లాలో టాప్‌లో నిలువడం సంతోషంగా ఉంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం  గ్రామానికో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో రైతులకు మేలు జరిగింది. 

జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ సహకారంతో..

రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ సహకారంతో ధాన్యాన్ని కొనుగోలు చేశాం. సంఘం ద్వారా రూ. 65.86కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించాం. ఉమ్మడి జిల్లాలోనే మంథని సంఘం టాప్‌లో నిలువడం ఆనందంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో నీటి నిల్వలు పెరిగి మంచి దిగుబడి వచ్చింది. కొనుగోళ్లకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. - కొత్త శ్రీనివాస్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌, మంథని