గురువారం 26 నవంబర్ 2020
Peddapalli - Jun 24, 2020 , 01:38:07

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

n  ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి

n  మున్సిపల్‌ కార్యాలయ సందర్శన

పెద్దపల్లి టౌన్‌: వానకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే దాసరి మనోహరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పెద్దపల్లి మున్సిపాలిటీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. కౌన్సిలర్ల సూచన మేరకు అధికారులు శానిటేషన్‌ పనులను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇక్కడ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ దాసరి మమతారెడ్డి, కమిషనర్‌ సీహెచ్‌ తిరుపతి, శానిటేషన్‌ సూపర్‌వైజర్లు రా మ్మోహన్‌రెడ్డి, రాజు, అధికారులు ఉన్నారు.

బాధిత కుటుంబానికి పరామర్శ

ఓదెల: మడక గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో గోసిక మల్లయ్య అనే వ్యక్తి మృతిచెందగా అతడి కుటుంబాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పరామర్శించారు. ఆయనవెంట టీఆర్‌ఎస్‌ యూత్‌ మండలాధ్యక్షుడు మ్యాడగోని శ్రీకాంత్‌గౌడ్‌, నా యకులు గుండేటి ఐలయ్య, నోముల ఇంద్రారెడ్డి, హన్మంతరావు, కోట నిరంజన్‌రెడ్డి, గొర్ల కుమార్‌, మహేందర్‌రెడ్డి, నరేశ్‌, పవన్‌ తదితరులున్నారు.