శనివారం 05 డిసెంబర్ 2020
Peddapalli - Jun 21, 2020 , 01:48:24

దివ్యాంగులకు వాహనాల అందజేత

దివ్యాంగులకు వాహనాల అందజేత

మంథని టౌన్‌ : పుట్ట లింగమ్మ ట్రస్టు ఆధ్వర్యంలో ముగ్గురు దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను  జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అందజేశారు. శనివారం మంథని గాంధీచౌక్‌ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంథనికి చెందిన రంగు రమేశ్‌, శ్రీరాంనగర్‌కు చెందిన రాంబాబు, ముత్తారం మండలం సీతంపల్లికి చెందిన సంపత్‌ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మోపెడ్‌ ట్రై సైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇబ్బందుల్లో ఉన్న వారికి సేవలు చేయడానికే ట్రస్టును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  కార్యక్రమంలో ట్రస్టు చైర్మన్‌ బిట్టు శ్రీనివాస్‌, నాయకులు తగరం శంకర్‌లాల్‌, బత్తుల సత్యనారాయణ, గుండా పాపారావు, శ్రీపతి బానయ్యలతో పాటు స్థానిక నాయకులు ఉన్నారు. 

చెక్కు పంపిణీ

మహాదేవపూర్‌ మండలం సూరారం గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్త కొత్తకొండ భిక్షపతి ఇటీవల ప్రమాదంలో మృతి చెందాడు. ఆయనకు టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వం ఉండడంతో మంజూరైన  రూ. 2లక్షలను ఆయన భార్య సుమలతకు నియోజకవర్గ ఇన్‌చార్జి, పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అందజేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుందని అన్నారు. 

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ ఉద్యోగోన్నతిపై సంబురాలు  

గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌కు  ఉద్యోగోన్నతి లభించడంపై శనివారం స్వేరోస్‌ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. కార్యక్రమానికి పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ హాజరై కేక్‌కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురుకులాల అభివృద్ధికి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ విశిష్ట సేవలనందించారన్నారు. ప్రవీణ్‌కుమార్‌ ఉద్యోగోన్నతి పొందడంపై సంతోషం వ్యక్తం చేశారు.