మంగళవారం 24 నవంబర్ 2020
Peddapalli - Jun 21, 2020 , 01:46:53

మహిళలకు ఉపాధి కల్పనే ధ్యేయం

మహిళలకు ఉపాధి కల్పనే ధ్యేయం

  • ఆర్పీలతో సమావేశంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

గోదావరిఖని: మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ తెలిపారు. స్వశక్తి సంఘాల ఆర్పీలతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం  చందర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సర్కార్‌ మహిళ సాధికారతలపై దృష్టి సారించిందన్నారు. ప్రత్యేకంగా మహిళలకు స్వయం ఉపాధి కల్పన కోసం కార్పొరేషన్‌ పరిధిలో రూ.6.50 కోట్ల ను కేటాయించామని తెలిపారు. ప్రభుత్వం అందించే రుణాలతో మహిళా స్వశక్తి సంఘాల సభ్యులు వ్యాపారాలు, కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని కుటుంబ పోషకులుగా మారాలని ఆకాంక్షించారు. రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని 50 డివిజన్లలో విజయమ్మ ఫౌండేషన్‌ ద్వారా కుట్టు మిషన్‌ సెంటర్లు ఏర్పాటు చేసి కుట్టు మిషన్లపై 2 నెలల పాటు ఉచితంగా శిక్షణ అందిస్తున్నామని వివరించారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్‌ అందిస్తున్నామని తెలిపారు. స్వశక్తి సంఘాల ఆర్‌పీలు గౌరవ వేతనం అందించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. స్ట్రీట్‌ వెండర్స్‌కు రుణాల మంజూరుతో ఈ ప్రాంతంలోని మహిళల స్వ యం ఉపాధి కోసం విజయమ్మ ఫౌండేషన్‌ కార్యక్రమాల బాధ్యత ఆర్‌పీలు తీసుకోవా లన్నారు. సమావేశంలో నగర మేయర్‌  బంగి అనిల్‌కుమార్‌, స్వశక్తి సంఘాల ఆర్‌పీలు తదితరులు ఉన్నారు.