ఆదివారం 29 నవంబర్ 2020
Peddapalli - Jun 21, 2020 , 00:37:15

‘పారిశుద్ధ్యం’పై నిర్లక్ష్యం వద్దు

‘పారిశుద్ధ్యం’పై నిర్లక్ష్యం వద్దు

  • సీజనల్‌ వ్యాధులపై   అప్రమత్తంగా ఉండాలి
  • నగర మేయర్‌ వై సునీల్‌రావు
  • కమిషనర్‌ క్రాంతితో కలిసి  పలు డివిజన్లలో పర్యటన

కార్పొరేషన్‌: వానకాలం ఆరంభమైనందున పారిశుద్ధ్య పనులపై నిర్లక్ష్యం చూపద్దు..అను క్షణం అప్రమత్తంగా ఉండాలని నగర మేయర్‌ బల్దియా సిబ్బందికి సూచించారు. సీజనల్‌ వ్యాధుల నివా రణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నగరంలోని 5, 10, 15, 19, 22, 23, 26, 33, 38వ డివిజన్లలో శనివారం పారిశుధ్య పనులు చే పట్టారు. 18, 19, 23, 33వ డివిజన్లలో మే యర్‌ కమిషనర్‌ క్రాంతితో కలిసి  పాదయాత్రలు చేసి ప్రజా సమస్యలను అడిగితెలుసుకున్నారు. డ్రైనేజీల్లో సిల్ట్‌ను తొలగించాలని కార్మికులకు సూచించారు. దోమలు పెరగకుండా ఫాగింగ్‌, స్ప్రే చేయాలన్నారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. నిరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో హైపోక్లోరైట్‌ పిచికారీకి చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని వీధుల్లోనూ ఫాగింగ్‌, బ్లీచింగ్‌ పనులు సాగిస్తున్నామన్నారు. 19వ డివిజన్‌లో నిల్వ నీటిని తొలగిం చేందుకు కాలువలు తవ్వారు. బుడగ జంగాలకాలనీలో సమస్యలను అడిగితెలుసుకున్నారు. డ్రైనేజీలు, రోడ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్లు సుధగోని మాధవికృష్ణాగౌడ్‌, రాజశేఖర్‌, అర్ష కిరణ్మయి, శానిటైజేషన్‌ సూపర్‌వైజర్‌ రాజ మనోహర్‌, సిబ్బంది గట్టు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.