బుధవారం 02 డిసెంబర్ 2020
Peddapalli - Jun 18, 2020 , 00:53:48

రావికంటి రామయ్య జయంతి

రావికంటి రామయ్య జయంతి

  • నివాళులర్పించిన మున్సిపల్‌ అధ్యక్షురాలు పుట్ట శైలజ

మంథని టౌన్‌: మంత్రపురి వేమన రావికంటి రామయ్య గుప్త జయంతి వేడుకలను మంథనిలో బుధవారం ఘనంగా నిర్వహించారు. గాంధీచౌక్‌లోని రామయ్య విగ్రహానికి మున్సిపల్‌ అధ్యక్షురాలు పుట్ట శైలజ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శతకాలు, గేయాలు, గొల్ల సుద్ధులు,  ఏకాంకికలు, బుర్ర కథలు వంటి రచనలు చేసిన గొప్పకవి రావికంటి రామయ్య అని కొనియాడారు. ఈ సందర్భంగా పుట్ట శైలజ పారిశుద్ధ్య సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం భారత్‌-చైనా సరిహద్దుల్లో అసువులుబాసిన వీర జవా న్‌ కర్నల్‌ సంతోష్‌బాబుకు నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పా టించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆరెపల్లి కుమార్‌, కౌన్సిలర్లు నక్క నాగేంద్ర, శ్రీపతి బానయ్య, గర్రెపల్లి సత్యనారాయణ, ఆర్యవైశ్య సంఘం నాయకులతోపాటు పలువురు పాల్గొన్నారు. 

అందరూ సహకరించాలి

మంథని టౌన్‌: మున్సిపాలిటీని పరిశుభ్రంగా, ప చ్చదనంతో తీర్చిదిద్దేందుకు కౌన్సిలర్లు, ప్రజలు సహకరించాలని మున్సిపల్‌ అధ్యక్షురాలు పుట్ట శైలజ కోరారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇన్‌చార్జి కమిషనర్‌ అనుపమారావుతో కలిసి బుధవారం టెలీకాన్ఫరెన్స్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. శానిటేషన్‌, సీసీ రోడ్లు, శానిటేషన్‌కు సంబంధించిన వస్తువుల బిల్లులతోపాటు, గతం లో చేసిన అభివృద్ధి పనుల బిల్లులపై కౌన్సిలర్లతో చర్చించి ఆమోదం తీసుకున్నారు. ఈ సందర్భం గా పుట్ట శైలజ మాట్లాడుతూ, వానకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పట్టణంలో పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు చేపట్టేలా చర్య లు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజలకు సీజనల్‌ వ్యాధుల గురించి అవగాహన కల్పించా లన్నారు. ఇక్కడ కౌన్సిలర్లు పాల్గొన్నారు.