గురువారం 26 నవంబర్ 2020
Peddapalli - Jun 18, 2020 , 00:53:47

జీడీకే-2 గని కార్మికులకు ప్రోత్సాహకాలు

జీడీకే-2 గని కార్మికులకు ప్రోత్సాహకాలు

గోదావరిఖని: సింగరేణి సంస్థ ఆర్జీ-1 పరిధిలోని జీడీకే-2 గని రిలే-ఏ కార్మికులకు ప్రోత్సాహకాలు అందించారు. వార్షిక బొగ్గు ఉత్పత్తి సాధించిన గనుల్లో సింగరేణి వ్యాప్తంగా 2వ గనికి స్థానం దక్కడంపై బుధవారం గని ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి ఏజెంట్‌ సురేశ్‌ హాజరై కార్మికులను అభినందించారు. ఆర్జీ-1 జీఎం సూచనల మేరకు రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధిస్తూ ఇదేస్ఫూర్తితో ముందుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో మేనేజర్‌ సాయిప్రసాద్‌, టీబీజీకేఎస్‌ పిట్‌ సెక్రటరీ లక్కాకుల లక్ష్మణ్‌, అధికారులు మాధవరెడ్డి, సంక్షేమాధికారి కిరణ్‌కుమార్‌, జీఎం కమిటీ సభ్యులు అనిల్‌, నాయకులు దాసరి నర్సయ్య, తిరుపతి, ఐలయ్య, రమేశ్‌, శ్రీనివాస్‌, రాజ్‌కుమార్‌ తదితరులున్నారు.