శుక్రవారం 27 నవంబర్ 2020
Peddapalli - Jun 17, 2020 , 02:14:27

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు

n    మంథని ఏడీఏ మురళి 

n    నకిలీ ఎరువులు విక్రయిస్తున్న ఇద్దరు మహిళల పట్టివేత 

n    62 బస్తాలు స్వాధీనం

మంథని టౌన్‌: అనుమతులు లేకుండా ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంథ ని ఏడీఏ మురళి హెచ్చరించారు. పట్టణంలోని పోచమ్మవాడలో మంగళవారం ఇద్దరు మహిళలు వర్మీ గోల్డ్‌ బస్తాలను ఎటువంటి అనుమతులు లేకుండా విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పక్కాసమాచారంతో ఏడీఏ, ఏవో అనూష, సి బ్బంది వారిని పట్టుకున్నారు. ఎరువులకు సంబంధించిన ఎటువంటి పత్రాలు లేక పోవడంతో 62 బస్తాలను సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఏడీఏ మురళి మాట్లాడుతూ.. ఏపీ రాష్ట్రం గుంటూరులోని ప్రభు బయోటెక్‌ గోరింట్లలో తయారుచేసిన ఎరువులను ఇద్దరు మహిళలు ఎలాంటి అనుమతులు లేకుండా పోచమ్మవాడలోని రైతులకు ఒక్కో బస్తాకు రూ.599కు విక్రయించేందుకు తీసుకువచ్చారన్నారు. ఈ ఎరువుల బస్తాలపై తయారు చేసిన తేదీ, ముగిసే గడువు లేకపోవడంతో నకిలీ ఎరువులుగా గుర్తించామని చెప్పారు. వీరివద్ద ఉన్న 62 బస్తాలను సీజ్‌ చేసి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు.