మంగళవారం 24 నవంబర్ 2020
Peddapalli - Jun 17, 2020 , 01:47:25

ఊళ్లన్నీ బాగుపడాలి..

ఊళ్లన్నీ బాగుపడాలి..

n  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్ష

n  పల్లెల ప్రగతిపై దిశానిర్దేశం

n  ఉమ్మడి జిల్లా నుంచి పాల్గొన్న కలెక్టర్లు, డీపీవోలు

 కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: ప్రతి గ్రామం ప్రగతిబాటలో నడవాలని, ఊర్లన్నీ బాగుపడాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షించారు. ప్రగతిభవన్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లు, డీపీవోలు, ఇతర జిల్లా అధికారులతో మంగళవారం సమీక్షించిన ఆయన, పల్లెల ప్రగతిపై దిశానిర్దేశం చేశారు. అవసరమైన నిధులు, విస్తృతమైన అధికారాలు, కావల్సినంత మంది అధికారులు, స్పష్టమైన విధానాలు, పాలనా సౌలభ్యం కల్పించిన నేపథ్యంలో గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలో దిశానిర్దేశం చేశారు. ఇన్ని అనుకూలతలున్న ప్రస్తుత పరిస్థితుల్లో అభివృద్ధి కాకపోతే ఇంకెప్పుడు గ్రామాలు బాగుపడవని చెప్పారు. గ్రామాల్లో రాబోయే నాలుగేళ్లకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని, అందుకు అనుగుణంగానే పనులు చేయాలని, ఈ వివరాలతో జిల్లా కార్డు తయారు చేయాలని సూచించారు.