సోమవారం 30 నవంబర్ 2020
Peddapalli - Jun 16, 2020 , 00:14:52

సకల కళావల్లభుడు

సకల కళావల్లభుడు

lఅలిశెట్టి మెచ్చిన చిత్రకారుడు ఎక్కల్‌దేవి శేఖర్‌

lవిభిన్న రంగాల్లో రాణింపు

lఆర్టిస్టుగా.. కెమెరామన్‌గా ప్రతిభ

ప్రకృతి అందాలను తన కెమెరాలో కంటికి ఇంపైన కోణాల్లో ఒడిసిపట్టే ఎక్కల్‌దేవి శేఖర్‌, తన కుంచెతో అద్భుతాలు ఆవిష్కరిస్తున్నాడు. ఓవైపు ఫొటో, వీడియో గ్రాఫర్‌గా రాణిస్తూనే, తన మదిలో మెదిలిన ఊహకు కాన్వాస్‌పై ప్రాణం పోస్తూ అపురూపమైన చిత్రాలు గీస్తూ అబ్బుర పరస్తున్నాడు. విభిన్న రంగాల్లో రాణిస్తూ ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంటున్న శేఖర్‌పై ‘నమస్తే’ ప్రత్యేక కథనం. - కోరుట్ల టౌన్‌

కోరుట్ల టౌన్‌: కోరుట్ల పట్టణానికి చెందిన ఎక్కల్‌దేవి శేఖర్‌ చిన్ననాటి నుంచే కళలపై ఆసక్తి పెంచుకున్నాడు. 1980లో డిగ్రీ పూర్తి చేసిన శేఖర్‌ కళపై మక్కువతో ఫొటోగ్రఫీ రంగంలో అడుగు పెటాడు. వృత్తినే దైవంగా నమ్మి అనేక అరుదైన దృశ్యాలను తన కెమెరాల్లో బంధించి ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇదేగాక వివిధ రంగాల్లోనూ రాణిస్తూ పలువురి మన్ననలు పొందుతున్నాడు. 

గెటప్‌ ఆర్టిస్టుగా ప్రతిభ.. 

తన ముందు నిలుచున్న వ్యక్తిని అచ్చుగుద్దినట్టుగా వివిధ రూపాల్లో చిత్రీకరించడంలో శేఖర్‌ సిద్దహస్తుడు. డిగ్రీ పూర్తి చేసిన కొద్దిరోజులకు మద్రాస్‌ రే ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో డిప్లోమా ఇన్‌ ఫిల్మ్‌ టెక్నాలజీ కోర్సును అభ్యసించాడు. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి గెటప్‌ ఆర్టిస్టుగా అద్భుతాలు సృష్టించాడు. కంప్యూటర్‌ సాయం లేకుండా కేవలం పెన్సిల్‌ ద్వారానే విభిన్న రూపాల్లో మనుషుల చిత్రాలు గీస్తున్నాడు. ఒకే వ్యక్తిని విభిన్న కోణాల్లో తన కుంచెతో కళ్లకు కట్టినట్లుగా ఆవిష్కరిస్తూ అబ్బురపరుస్తున్నాడు. 

చిత్ర కళలోనూ రాణింపు.. 

చిత్ర కళలోను భళా అనిపించుకున్న శేఖర్‌..1986లో ఓ వీడి యో చిత్రాన్ని రూపొదించాడు. 1990లో ప్రతాప్‌ దర్శకత్వంలో రాం కుమార్‌గా హీరోగా నటించిన చిత్రానికి వీడియోగ్రాఫర్‌గా పనిచేశాడు. ‘మంచం మీద మనిషి’ అనే నాటిక ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది. కాగా, ఫొటోగ్రఫీలో మంచిపేరు సంపాదించిన శేఖర్‌ బండి రాజన్‌బాబు స్మారక ఉత్తమ అవార్డును సైతం అందుకున్నాడు.  ఫొటోగ్రఫీలో ఉన్న సమయంలో పేరేన్నిక గన్న కవి అలిశెట్టి ప్రభాకర్‌ నుంచి ప్రశంసలు అందుకున్నాడు.