బుధవారం 02 డిసెంబర్ 2020
Peddapalli - Jun 14, 2020 , 01:29:22

పార్టీని మరింత బలోపేతం చేయాలి

పార్టీని మరింత బలోపేతం చేయాలి

  • n సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలి
  • n పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి

పెద్దపల్లిరూరల్‌:  టీఆర్‌ఎస్‌ పార్టీని మరింత బలోపేతం చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని ఆరు మండలాలకు టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షులను జిల్లా కేంద్రంలోని దాసరి క్యాంపు కార్యాలయంలో శనివారం నియమించా రు. పెద్దపల్లి మండలాధ్యక్షుడిగా మర్కు లక్ష్మణ్‌, సుల్తానాబాద్‌ మండలాధ్యక్షుడిగా పాల రామారావు, ఓదెల మండలాధ్యక్షుడిగా ఐరెడ్డి వెంకట్‌రెడ్డి, కాల్వశ్రీరాంపూర్‌ మండలాధ్యక్షుడిగా గొడు గు రాసకొమురయ్య, జూలపల్లి మండలాధ్యక్షుడిగా శాతల్ల కాంతయ్య, ఎలిగేడు మండలాధ్యక్షుడిగా బైరెడ్డి రాంరెడ్డిని మెజార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు పార్టీ నిబంధనలను అనుసరించి ప్రకటించినట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి బంగారు తెలంగాణగా తయారు చేయాలన్న కాంక్షతో సీఎం కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారని తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలని పిలుపునిచ్చారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షులకు ఎమ్మెల్యే పుష్ప గుచ్ఛా లు అందించి అభినందించారు. జిల్లా గ్రం థాలయాల సంస్థ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌, జడ్పీ సభ్యుడు బొద్దుల లక్ష్మణ్‌, ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, వైస్‌ ఎంపీపీ మొగురం రమేశ్‌ వేర్వేరు గా కాంతయ్యకు అభినందనలు తెలిపారు.  కార్యక్రమంలో పెద్దపల్లి, సుల్తానాబాద్‌ ఎంపీపీలు బండారి స్రవంతి శ్రీనివాస్‌గౌడ్‌, బాలాజీరావు , పెద్దపల్లి జడ్పీటీసీ రామ్మూర్తి, పెద్దపల్లి సింగిల్‌ విండో చైర్మన్‌ మాదిరెడ్డి నర్సింహారెడ్డి, నాయకులు  రమేశ్‌గౌడ్‌, బుర్ర శ్రీనివాస్‌గౌడ్‌, కాసర్ల అనంత రెడ్డి, పురం ప్రేమ్‌ చందర్‌రావు, అరుణ్‌గౌడ్‌, సలేంద్ర రాములు యాదవ్‌,  రాంరెడ్డి, ఆకుల మహేందర్‌, ఆళ్ల రాజిరెడ్డి, బోడకుంట చినస్వామి, పల్లె కుమార్‌ తదితరులున్నారు.

రైతుల సౌకర్యార్థమే నిర్మాణాలు 

సుల్తానాబాద్‌రూరల్‌:  రైతుల సౌకర్యార్థమే కల్వర్టులు నిర్మిస్తున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. బొంతకుంటపల్లి శివారులో రూర్బన్‌ పథకం ద్వారా రూ. 10 లక్షల ని ధులతో, రామునిపల్లిలో రూ. 8లక్షలతో చేపట్టిన కల్వర్టుల నిర్మాణ పనులను ఎమ్మెల్యే శనివారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు పొలాలకు వెళ్లేందుకు ఇబ్బంది పడకుండా ఉండేందుకు పలు గ్రామాల్లో కల్వర్టులను నిర్మిస్తున్నామని వివరించారు. కల్వర్టు నిర్మాణాల ద్వారా ఎడ్లబండ్లతో పాటు ట్రాక్టర్ల రాకపోకలు సాగుతాయన్నారు. రైతులు ఎరువులు, ధాన్యం తీసుకెళ్లేందుకు తిప్ప లు తప్పుతాయని తెలిపారు. బొంతకుంటపల్లి, రామునిపల్లితోపాటు చిన్నబొంకూర్‌, నారాయణపూర్‌, గట్టేపల్లిల్లో కూడా కల్వర్టుల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. అనంతరం బొంతకుంటపల్లి నుంచి మోడల్‌కాలనీకి వెళ్లే రోడ్డుపై నాయకులతో ఎమ్మెల్యే చర్చించారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీరావు, సర్పంచులు ఇరుగురాల అనిత, మల్యాల శ్రీనివాస్‌, ఎంపీటీసీ అనిత, ఉప సర్పంచులు పొలాడి రమ, రామచంద్రారెడ్డి, నాయకులు కోట రాంరెడ్డి, పాల రామారావు,  తిరుపతిరావు, అంజయ్య, తిరుపతి, కారోబార్‌ రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.