మంగళవారం 01 డిసెంబర్ 2020
Peddapalli - Jun 14, 2020 , 01:06:01

నేడు ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు మంత్రి నిరంజన్‌రెడ్డి

నేడు ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు మంత్రి నిరంజన్‌రెడ్డి

 పనులపై అధికారులతో సమీక్ష

 శనివారం సాయంత్రమే జిల్లాకు రాక

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ/జ్యోతినగర్‌: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌)ను ఆదివారం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సందర్శించనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి 12:30 గంటలకు ఫ్యాక్టరీలోనే ఉండి పనులను పర్యవేక్షించనున్నారు. అయితే ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పర్యటన నేపథ్యంలో శనివారం రాత్రే మంత్రి నిరంజన్‌రెడ్డి జిల్లాకు చేరుకున్నా రు. ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని వీఐపీ గెస్ట్‌హస్‌కు రాగా, ఎమ్మె ల్యే చందర్‌  పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.