శుక్రవారం 27 నవంబర్ 2020
Peddapalli - Jun 10, 2020 , 02:38:15

టాప్‌గేర్‌లో వసూళ్లు

టాప్‌గేర్‌లో వసూళ్లు

మంథని మున్సిపాలిటీలో 90శాతం పన్నుల వసూళ్లు

పట్టణంలోని 13వార్డుల్లో ఇంటి పన్ను, నల్ల బిల్లు, లైసెన్స్‌ ఫీజు, మున్సిపాలిటీకి చెందిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ల కిరాయి, ఖాళీ స్థలాల్లోని పన్నులు, ఆర్జీలు, ఫ్లెక్సీ ప్రకటనలతోపాటు వివిధ రకాల పన్నుల వసూళ్లపై ప్రణాళికాబద్ధంగా ముం దుకు సాగుతున్నారు. ఇటు ప్రజలకు ఇబ్బందులు లేకుండా, మున్సిపాలిటీ ఆదాయం దెబ్బతినకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు పన్నుల వసూ ళ్లు కొనసాగిస్తున్నారు. ప్రజలు సైతం రెగ్యులర్‌గా పన్నులు చెల్లిస్తుండడంతో వసూళ్లు సులువుగా మారాయి. ఈ నిధులతో అభివృద్ధి పనులు, కార్యాలయ నిర్వహణ, పారిశుధ్య సిబ్బంది, ఉ ద్యోగుల జీతభత్యాలు, మంచినీటి సరఫరా, స్ట్రీట్‌ లైటింగ్‌ నిర్వహణ లాంటి కార్యక్రమాలకు  ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతో మున్సిపల్‌ కార్యాలయ నిర్వాహణ సైతం సజావుగా కొనసాగుతున్నది.  

పన్నుల వసూళ్లు ఇలా.. 

2019-20 ఆర్థిక సంవత్సరానికి 13వార్డుల్లో నీటి బిల్లులు రూ.31.35 లక్షలకు ఇప్పటికే రూ.22.87లక్షలు వసూళ్లు చేశారు. ఇంటి పన్ను రూ.43.46 లక్షలు ఉండగా ఇప్పటివరకు రూ. 38.63లక్షలు, లైసెన్స్‌ పన్నులు రూ.5.34లక్షలకు రూ.4.81లక్షలు, ప్లాట్ల పన్నులు రూ. 24.61 లక్షలకు రూ.4.05లక్షలు, ప్రకటనల పన్ను రూ.21వేలు,  షాపింగ్‌ కాంప్లెక్స్‌ కిరాయిలు రూ.70.56లక్షలకు రూ.53.72లక్షలు వసూలు  చేశారు. అదే విధంగా తైబజారుకు రూ. 6.15లక్షలు, స్లాటర్‌ హౌస్‌కు రూ.71వేలు, పశువుల సంతకు రూ.2.95లక్షలు, భవన నిర్మాణ అనుమతులకు రూ.16.63 లక్షలు, సర్టిఫికెట్ల దరఖాస్తుల ద్వారా రూ.1.01లక్షలు, ఖాళీ స్థలాల పన్ను రూ.2.97 లక్షలు, పేరు మార్పిడి రూ.7లక్షల ఆదాయం సమకూరినట్లు మున్సిపల్‌ అధికారులు తెలిపారు. 

వసూళ్ల కోసం ప్రత్యేక ప్రణాళిక : పుట్ట శైలజ, మున్సిపల్‌ అధ్యక్షురాలు

పన్నుల వసూళ్లకు ప్రత్యేక ప్రణాళికతో ముందకెళ్తున్నాం. బిల్‌ కలెక్టర్లతో మూడు టీమ్‌లను ఏర్పాటు చేశాం. వీరు తమతమ పరిధిలోని వార్డుల్లో పర్యటించి వందశాతం పన్నులు వసూలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కువ శాతం ప్రజలు వారే కార్యాలయాలకు వచ్చి ఇంటి పన్ను, నల్లా బిల్లులు చెల్లిస్తున్నారు. పన్నుల ఆదాయంతో మున్సిపాలిటీని మరింత బలోపేతం చేస్తూ ప్రజలకు పలు విధాలుగా సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.