శుక్రవారం 27 నవంబర్ 2020
Peddapalli - Jun 10, 2020 , 02:24:46

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలి

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలి

 n  సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ n అధికారులతో సమావేశం

జగిత్యాల, నమస్తే తెలంగాణ/ధర్మపురి: జిల్లాలో పేద, నిరుద్యోగ కుటుంబాల్లోని యువతకు స్వయం ఉపాధి కల్పించాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆదేశించారు. కరీంనగర్‌ క్యాంపు కార్యాలయంలో గ్రామీణ ప్రాంతానికి చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధిపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది యువకులు స్వగ్రామాలకు చేరారని, వారికి అర్హతలు, నైపుణ్యాలను బట్టి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ‘నైపుణ్యాభివృద్ధ్ది శిక్షణ-ఉపాధి అవకాశం’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. పైలట్‌ ప్రాజెక్టుగా ధర్మపురి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వివిధ ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు క ల్పించాలన్నారు. స్వ యం ఉపాధి సంఘా ల అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. స్వరాష్ర్టానికి వచ్చిన తెలంగాణ నిర్మాణ రంగం వలస కార్మికుల వివరాలను న్యాక్‌ ద్వారా సేకరించాలన్నారు. నైపుణ్య శిక్షణతోపాటు, ఉపాధి కల్పన, నిరుద్యోగ యువతకు సబ్సిడీ లోన్లపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ లక్ష్మీనారాయణ, జిల్లా మైనార్టీ అధికారి వరదరాజన్‌, ఎపీడీ సతీశ్‌ కుమార్‌, జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరేశ్‌, వారథి సొసైటీ అధికారి, ధర్మపురి నియోజకవర్గ, ఎంపీడీఓలు, ఎడీ నాక్‌ అధికారులు పాల్గొన్నారు.