శుక్రవారం 27 నవంబర్ 2020
Peddapalli - Jun 09, 2020 , 02:21:41

పల్లె ప్రగతి స్ఫూర్తిని కొనసాగించాలి

పల్లె ప్రగతి స్ఫూర్తిని కొనసాగించాలి

n కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

n ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం ముగింపు

ముత్తారం: పల్లె ప్రగతి స్ఫూర్తిని ప్రజలు నిరంతరం కొనసాగించాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ సూచించారు. ముత్తారం మండలం ఓడేడులో పల్లె ప్రగతి చివరి రోజు చేపట్టిన కార్యక్రమానికి సోమవారం ఆమె హాజరై గ్రామంలో నిర్వహిస్తున్న నర్సరీ, పక్కనే ఉన్న శ్మశాన వాటిక పనులను పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ వద్ద  మాట్లాడుతూ, పారిశుధ్య పనులను ప్రజా ప్రతినిధులు బాధ్యతగా తీసుకోవాలన్నారు. కొవిడ్‌-19 నియంత్రణ చర్యలు తప్పక పాటించాలని సూచించారు. ఓడేడులో సర్పంచ్‌ బక్కారావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పల్లె ప్రగతి పనులు బాగున్నాయని అభినందించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో వినోద్‌ కుమార్‌, డీపీవో సుదర్శన్‌, మండల ప్రత్యేక అధికారి శ్యాంప్రసాద్‌ నాయక్‌, డీఎల్‌పీవో రాంబాబు, ఎంపీపీ జక్కుల ముత్తయ్య, జడ్పీటీసీ చెలుకల స్వర్ణలత, తహసీల్దార్‌ వెంకటలక్ష్మి, ఎంపీడీవో మణికంటేశ్‌, ఏవో శ్రీకాంత్‌, మండల వైద్యాధికారి వంశీకృష్ణ, ఎస్‌ఐ నరసింహారావు,  ఎంపీటీసీ పొతిపెద్ది కిషన్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ దేవునూరి భానుకుమార్‌, వైస్‌ ఎంపీపీ సూదాటి రవీందర్‌రావు, ఏపీఎం పద్మ, అటవీ శాఖ సెక్షన్‌ అధికారి నర్సయ్య, ఎంపీవో వేణుమాధవ్‌, మాజీ సర్పంచులు ఇలందుల అశోక్‌గౌడ్‌, చెలుకల అశోక్‌ యాదవ్‌, గ్రామస్తులు కట్కూరి రాజిరెడ్డి, తీగల రాజేశ్వరరావు, పాపారావు, మహేందర్‌, దామోదర్‌, రమేశ్‌, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. 

నిరంతరం జాగ్రత్తగా ఉండాలి 

మంథని టౌన్‌: కరోనా వైరస్‌, సీజనల్‌ వ్యాధుల నేపథ్యంలో ప్రజలంతా నిరంతరం జాగ్రత్తగా ఉండాలని మంథని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో చివరి రోజైన సోమవారం మంథని మున్సిపల్‌ పరిధిలోని 11వ వార్డులో పుట్ట శైలజ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె, అధికారులు వార్డు పరిధిలోని కూరగాయల మార్కెట్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌ ఏరియాల్లో పర్యటించారు. అనంతరం మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మాట్లాడారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఆదేశాలనుసారం వ్యాపారస్తులు, ప్రజలు వ్యక్తి గత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. ప్రజలు ఇంటి ముందు, పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలన్నారు. దీంతో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని పేర్కొన్నారు. ఆమె వెంట ఇన్‌చార్జి కమిషనర్‌ అనుపమారావు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆరెపల్లి కుమార్‌, కౌన్సిలర్‌ వీకే రవి పాల్గొన్నారు. మంథని రూరల్‌: పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మండలంలోని విలోచవరం, పోతారం, ఆరెంద, మల్లారంతో పాటు అన్ని గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్వహించారు. ఆయా గ్రామా ల్లో పర్యటిస్తూ ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. రోడ్ల వెంట ఉన్న చెత్తా చెదారాన్ని తొలగింపజేశారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో వెంకటచైతన్య, ఎంపీవో గోవర్ధన్‌, ఏపీవో సదానందం, ఈవోపీఆర్డీ ఉపేందర్‌, ఐకేపీ ఏపీఎం పద్మ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.  కమాన్‌పూర్‌: మండలంలోని కమాన్‌పూర్‌, జూలపల్లి, గుండారం, పేరపల్లి, గొల్లపల్లి, రొంపికుంట, నాగారం, పెంచికల్‌పేట, సిద్దిపల్లెల్లో సర్పంచుల ఆధ్వర్యంలో పల్లె ప్రగతి పనులను నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రతతోపాటు చెత్తాచెదారం తొల గింపు పనులు చేయించారు. ఆయా జీపీల వద్ద సమీక్షా సమావేశాలు చేపట్టారు. ఎంపీడీవో వెంకటేశ్‌జాదవ్‌ మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి పర్యవేక్షించారు. రామగిరి : బేగంపేటలో చేపట్టిన కార్యక్రమానికి ఎంపీడీవో విజయకుమార్‌ హాజరై పనులను పరిశీలించారు. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి, ఇంకుడు గుంతలు తప్పని సరిగా నిర్మించుకోవాలని సపూచించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ము రుగు కాలువలు శుభ్రం చేసి, చెత్తాచెదారం తొలగించారు. విద్యుత్‌ సమస్యలు పరిష్కరించారు. కార్యక్రమాల్లో ఈజీఎస్‌ ఏపీవో రమేశ్‌బాబు, సర్పంచులు బుర్ర పద్మ, గాజుల ప్రశాంతి, బడికెల విజయ, పల్లె ప్రతిమ, అల్లం పద్మ, దాసరి లక్ష్మి, రామగిరి లావణ్య, పాశం ఓదెలు, కొండవేన ఓదెలు, అంగన్‌వాడీ టీచర్లు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.