సోమవారం 23 నవంబర్ 2020
Peddapalli - Jun 08, 2020 , 03:08:53

నేడు కరీంనగర్‌ అభివృద్ధిపై సమీక్ష

నేడు కరీంనగర్‌ అభివృద్ధిపై సమీక్ష

కార్పొరేషన్‌:   కరీంనగర్‌ అభివృద్ధిపై రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సోమవారం సమీక్షించనున్నారు. హైదరాబాద్‌లోని సీడీఎంఏ కార్యాలయంలో నిర్వహించనున్న సమావేశానికి  మంత్రి గంగుల, మేయర్‌ సునీల్‌రావు, కలెక్టర్‌ శశాంక, బల్దియా కమిషనర్‌ వల్లూరి క్రాంతి హాజరుకానున్నారు. ఉదయం నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, మధ్యా హ్నం స్మార్ట్‌సిటీ పనుల పురోగతిపై చర్చించనున్నారు.  ముఖ్యంగా ఉదయం జరిగే సమావేశంలో నగరంలో ప్రస్తుతం సీఎం అస్యూరెన్స్‌ నిధులు రూ. 350 కోట్లతో సాగుతున్న అభివృద్ధ్ది పనులపై  సమీక్షించనున్నారు. అలాగే సుందరీకరణ పనులపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. నగరంలో ఇప్పటికే స్మార్ట్‌సిటీ మొదటి విడుతలో భాగంగా రూ. 235 కో ట్లతో చేపట్టిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వీటి పురోగతిపై చర్చించడంతో పాటు  రెండో విడుతలో చేపట్టాల్సిన పనులపై కూడా సమీక్షించే అవకాశం ఉన్నది. ముఖ్యంగా నగరంలో 24 గంటల నీటి సరఫరాపై సమగ్రంగా చర్చించే అవకాశాలున్నాయి.  ఇప్పటికే నగరంలో రోజూ మంచినీటి సరఫరాకు సంబంధించిన ట్ర యల్న్‌ విజయవంతంగా సాగుతున్నది. మంత్రి కేటీఆర్‌తో  ప్రారంభించేందుకు  మంత్రి గంగుల, మేయర్‌ సునీల్‌రావు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమావేశంలోనే ఈ ప్రారంభించే తేదీ, సమయంపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.  అలాగే నగరంలో ఇంటిగ్రేటేడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మాణం, వివిధ ప్రాంతాల్లో చేపట్టాల్సినా రోడ్ల అభివృద్ధి, డంప్‌యార్డును క్లీనింగ్‌ చేసే పనులను రెండో విడుత చర్చించనున్నారు. సు మారు రూ. 200 కోట్లతో కమాండ్‌ కంట్రోల్‌ సెం టర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.  ఈ సెంటర్‌ను పోలీసు, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే విధంగా ప్రణాళికలు సిద్ధ్దం చేశారు. ముఖ్యంగా పౌరుల భద్రతతో పాటుగా, పారిశుధ్య నిర్వహణ, నీటి సరఫరా, ఇతరత్రా ఎప్పటికప్పుడు కమాండ్‌ సెంటర్‌ ద్వారానే పర్యవేక్షించే విధంగా  ఏర్పాట్లు చేస్తున్నారు.  అలాగే ఏళ్ల తరబడి  నానుతున్న డం ప్‌యార్డ్‌పై కీలకనిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.  

మంత్రి సమీక్షతో పనుల్లో వేగం..

మంత్రి కేటీఆర్‌  సమీక్షతో అభివృద్ధి పనుల్లో వేగం పెరిగే అవకాశం ఉన్నది. ఇప్పటికే నగరంలో సీఎం అస్యూరెన్స్‌ నిధులతో అనేక పనులు సా గుతుండగా.. స్మార్ట్‌సిటీ కింద ప్రధాన లింకు రోడ్ల అభివృద్ధ్ది పనులు సాగుతున్నాయి. ఇప్పుడు మం త్రి సమీక్షలో అంతర్గత రోడ్లు, వివిధ గ్రాంట్లతో చేపట్టే రోడు, స్మార్ట్‌సిటీ రెండో విడుతలో సుమారుగా రూ. 500 కోట్లతో చేపట్టాల్సినా పనులకు సంబంధించి కీలక నిర్ణయాలు వెలువరించే అవకాశాలున్నాయి.