బుధవారం 08 జూలై 2020
Peddapalli - Jun 05, 2020 , 01:35:02

కాంగ్రెస్‌వి శవరాజకీయాలు

కాంగ్రెస్‌వి శవరాజకీయాలు

రంగయ్య మృతిపై రాద్దాంతం ఎందుకు

మల్లు భట్టికి కనీస అవగాహన లేదు 

దళితులను అవమానిస్తే సహించం

పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌

రామగిరి: దళితులపై మొసలి కన్నీరు కారుస్తూ కాంగ్రెస్‌ నే తలు శవరాజకీయాలు చేస్తున్నారని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ మండిపడ్డారు. రామయ్యపల్లికి చెందిన శీలం రంగ య్య ఇటీవల ఆత్మహత్య చేసుకోగా, గురువారం సాయంత్రం జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌తో కలిసి రంగయ్య కుటుంబ స భ్యులను పరామర్శించారు. అన్ని విధాలా అండగా ఉంటామ ని, అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ నేతలు రంగయ్య మృ తిని కావాలనే రాద్దాంతం చేస్తున్నారని, దళితులను అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చదువుకున్న విజ్ఞులు, సీనియర్‌ నేతలు సైతం కేసును తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క, స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు వంటి వారు అవగాహన లేకుండా చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. రంగ య్య ఠాణాలో చున్నీతో ఉరేసుకుంటే.. అది ఎక్కడిదని అడుగుతున్నారన్నారు. కరోనాతో రంగయ్య మాస్క్‌కు ప్రత్యామ్నాయంగా చున్నీ వాడే అలవాటు చేసుకున్నట్లు కుటుంబ సభ్యు లే చెబుతున్నారని, మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేస్తున్నా రాజకీయం చేయడం ఎందుకని ప్రశ్నించారు. కనీస అవగాహన లేకుండా ప్రెస్‌మీట్లలో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఘటనపై హోం మత్రి, డీజీపీ స్పందించాలని డిమాండ్‌ చేయడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రంగయ్య కేసు హైకోర్టులో ఉండగా, జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. దళితులను అ వమానిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. బడుగు బలహీన వర్గాల ఆభ్యున్నతి ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని, అనేక పథకాలతో అండగా నిలుస్తున్నదని చెప్పారు. జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు దళితులను అడ్డుపెట్టుకొని శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తన స్వార్థ రాజకీయాల కోసం వారిని పా వులుగా వాడుకుంటూ అవమానిస్తున్నారని దుయ్యబట్టారు. ఇక్కడ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌, ఎంపీపీలు ఆరెల్లి దేవక్క, కొండ శంకర్‌, ఏఎంసీ చైర్మన్‌ పూదరి సత్యనారాయణ గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు దాసరి రాయలింగు, ఆరెల్లి కొమురయ్య గౌడ్‌, కుమార్‌ యాదవ్‌, కన్నూరి శ్రీశైలం, బేతి కుమార్‌, ఆసం తిరుపతి, అల్లం తిరుపతి ఉన్నారు.logo