ఆదివారం 29 నవంబర్ 2020
Peddapalli - Jun 05, 2020 , 01:26:28

పరిశుభ్రతతోనే ఆరోగ్యం

పరిశుభ్రతతోనే ఆరోగ్యం

జోరుగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం 

ఉత్సాహంగా పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు

పెద్దపల్లి జంక్షన్‌: వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించినప్పుడే  ఆరోగ్యంగా ఉంటామని ఎంపీపీ బండారి స్రవంతి పేర్కొన్నారు. మండలంలోని సబ్బితం, రంగాపూర్‌ గ్రామాల్లో జరుగుతున్న పల్లె ప్రగతి, ఉపాధి హామీ, నర్సరీల పనులను గురువారం ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  ఇంటితో పాటు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.  హరితహారానికి మొక్కలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎంపీడీవో రాజు, సర్పంచులు సదయ్య, లావణ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు బండారి శ్రీనివాస్‌, గంట రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి జంక్షన్‌:  మండలంలో పల్లె ప్రగతి పనులు జోరుగా సాగుతున్నాయి. ఆయా గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు.  కొత్తపల్లి సర్పంచ్‌ శిలారపు సత్యం, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

కాల్వశ్రీరాంపూర్‌: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని మండల ప్రత్యేకాధికారి తిరుమల్‌ ప్రసాద్‌ అన్నారు. మండలంలోని ఇద్లాపూర్‌, పెద్దరాత్‌పల్లి గ్రామాల్లో పారిశుధ్య పనులను అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. అంకంపల్లిలో మంచినీటి ట్యాంకుల్లో క్లోరినేషన్‌ చేయించారు. ఎంపీపీ నూనేటి సంపత్‌, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, ఎంపీడీవో కిషన్‌, సర్పంచులు దొంతరవేన రజిత, ఓరుగంటి కొమురయ్యగౌడ్‌, ఆకుల చిరంజీవి,  ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ టీచర్లు, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. 

జూలపల్లి: జూలపల్లి, ఎలిగేడు మండలాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు కొనసాగాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో పర్యటించారు. మంచి నీటి ట్యాంకులు, మురుగు కాలువలు శుభ్రం చేయించారు. అబ్బాపూర్‌, కుమ్మరికుంటలో ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి పారిశుధ్య పనులను పరిశీలించారు. తాగునీటి పైప్‌ లైన్లు, గేట్‌ వాల్వుల లీకేజీలకు మరమ్మతులు చేయించారు. జూలపల్లి, ఎలిగేడు మండల పరిషత్‌ కార్యాలయాల్లో పారిశుధ్య కార్యక్రమం నిర్వహణ తీరుపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి, గ్రామస్థాయి అధికారుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. మండల ప్రత్యేకాధికారులు సుధాకర్‌, తిరుపతిరావు, ఎంపీడీవో వేణుగోపాల్‌రావు, ఎంపీవోలు రమేశ్‌, అనిల్‌రెడ్డి, గ్రామ ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు. 

 ధర్మారం: మండలంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం కొనసాగుతున్నది.  ఈనెల ఒకటిన రచ్చపల్లిలో పారిశుధ్య కార్యక్రమాన్ని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రారంభించగా, గ్రామాల్లో ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో జోరుగా చేపడుతున్నారు. ఆయా గ్రామాల్లో గురువారం  మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయించి, పైపులైన్‌, గేట్‌వాల్వుల లీకేజీలకు  మరమ్మతులు చేయించారు. జడ్పీటీసీ పూస్కూరు పద్మజ, మండల ప్రత్యేకాధికారి ప్రవీణ్‌ రెడ్డి, ఎంపీడీవో జయశీల ఎర్రగుంటపల్లి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో చేపడుతున్న పారిశుధ్య పనులు, హరితహారంలో నాటిన మొక్కలను పరిశీలించారు. ఇక్కడ సర్పంచ్‌ కొత్త లక్ష్మి, ఎంపీటీసీ గాగిరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ రజిత, ఎంపీవో శంకరయ్య, పాల్గొన్నారు. కటికెనపల్లిలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల ఆవరణలో శ్రమదానం చేశారు. ఇక్కడ సర్పంచ్‌ కారుపాకల రాజయ్య,  కోఆప్షన్‌ సభ్యుడు పెసరి రాజయ్య, ప్రత్యేకాధికారి స్వప్న, ఏఎన్‌ఎం నళిని, తదితరులు పాల్గొన్నారు.