సోమవారం 06 జూలై 2020
Peddapalli - Jun 04, 2020 , 02:47:34

కల్వరి టెంపుల్‌ సాయం మరువలేనిది

కల్వరి టెంపుల్‌ సాయం మరువలేనిది

రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

ధర్మపురి నియోజకవర్గంలో వెయ్యి కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ

పెగడపల్లి(వెల్గటూర్‌): కరోనా విపత్తు సమయంలో హైదరాబాద్‌కు చెందిన కల్వరి టెంపుల్‌ పేదలకు చేస్తున్న సాయం మరువలేనిదని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. వెల్గటూర్‌ మండలం రాజరాంపల్లి ఆర్‌ఎస్‌ గార్డెన్‌లో బుధవారం ధర్మపురి నియోజకవర్గంలోని ఆరు మండలాల పాస్టర్లు, ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్లు, జర్నలిస్టులకు చెందిన వెయ్యి కుటుంబాలకు నెలకు సరిపడా రూ.30 లక్షల విలువైన 23 రకాల నిత్యావసర వస్తువుల కిట్లను కల్వరి టెంపుల్‌ పాస్టర్‌ బ్రదర్‌ సతీశ్‌కుమార్‌, కలెక్టర్‌ రవితో కలిసి మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కల్వరి టెంపుల్‌ ఆధ్వర్యంలో వేల మందికి నిత్యావసర వస్తువులను అందజేస్తూ తమ ఉదారతను చాటుకుంటున్నారని అభినందించారు. కల్వరి టెంపుల్‌ పాస్టర్‌ సతీశ్‌కుమార్‌ మాట్లాడుతూ కరోనా సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా తమ సంస్థ నుంచి ఇప్పటివరకు 80 వేల క్వింటాళ్ల నిత్యావసర సరుకులను పంపిణీ చేశామని తెలిపారు. కలెక్టర్‌ రవి మాట్లాడుతూ కల్వరి టెంపుల్‌ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న పేదలకు నిత్యావసర సరుకులను సమకూర్చాలని కోరారు. కార్యక్రమంలో కల్వరి టెంపుల్‌ సభ్యుడు రైడ్‌ అండ్‌ రోజ్‌, వెల్గటూర్‌ ఎంపీపీ లక్ష్మి, జడ్పీటీసీ సుధారాణి, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు ఏలేటి కృష్ణారెడ్డి, గుర్రం మోహన్‌రెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్లు గూడ రాంరెడ్డి, మత్యాల బలరాంరెడ్డి, మండల ప్రత్యేకాధికారి నరేశ్‌, తహసీల్దార్‌ రాజేందర్‌, ఎంపీడీవో సంజీవరావు, సర్పంచులు వెల్లి శేఖర్‌, మారం జలంధర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు నూనె శ్రీనివాస్‌, రాంచంద్రంగౌడ్‌, సింహాచలం జగన్‌, కొప్పుల సురేశ్‌, భరత్‌, కొనమల్ల లింగయ్య, బొడ్డు రామస్వామి, కో ఆప్షన్‌ సభ్యుడు రిజాజ్‌ తదితరులున్నారు.


logo