సోమవారం 06 జూలై 2020
Peddapalli - Jun 03, 2020 , 03:45:57

ఆరేండ్లలోనే అద్భుత ప్రగతి

ఆరేండ్లలోనే అద్భుత ప్రగతి

  •  రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా తెలంగాణ 
  •  ప్రతి ఒక్కరూ కరోనా నియంత్రణ చర్యలు పాటించాలి 
  • రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌ 

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ: రాష్ట్రం ఏర్పడిన ఆరేండ్లలోనే తెలంగాణ ఘననీయమైన ప్రగతి సా ధించి దేశానికే దిక్సూచిగా నిలిచిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. దేశం మొత్తం మీద 83 లక్షల మెట్రిక్‌ ట న్నుల ధాన్యం కొనుగోలు చేస్తే అందులోనా ఒక్క మన రాష్ట్రం వాటానే 63శాతం ఉందని, అందునా 53లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ఎఫ్‌సీఐకి అందించి తెలంగాణ నేడు దేశానికే అన్నపూర్ణగా అవతరించిందని చెప్పా రు.

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని, మంత్రి మాట్లాడారు. 60 ఏండ్ల సుదీర్ఘ పోరాటం, అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రంలో ఆరేండ్లలోనే అనేక విజయాలు సాధించామన్నా రు. యావత్‌ దేశానికే తెలంగాణ ఒక దిక్సూచిగా మారిందని చెప్పా రు. ధాన్యం కొనుగోళ్లు, సేకరణలో దేశానికే మన మే ఆదర్శమని, రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా తెలంగాణ నిలుస్తున్నదని అభివర్ణించారు. కరోనా నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ సూచనలు పాటించాలని సూచించారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్నప్పటికీ ప్రజలకు వైద్యం అందించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధించిన ప్రగతిపై అధికారుల అనుభవాలను కలెక్టర్‌ తెలుసుకున్నారు. పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేత, ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, డీసీపీ రవీందర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌, రామగుండం మేయర్‌ అనీల్‌కుమార్‌ ఉన్నారు.logo