గురువారం 26 నవంబర్ 2020
Peddapalli - May 29, 2020 , 01:33:35

విత్తనాలొచ్చినయ్‌..

విత్తనాలొచ్చినయ్‌..

 సన్నరకాల సాగులో భాగంగా బీపీటీ సరఫరా

 కరీంనగర్‌ జిల్లాకు వచ్చిన క్వింటాళ్లు: 1366.25 

హుజూరాబాద్‌ : సమగ్ర, సుస్థిర వ్యవసాయంలో భాగంగా జిల్లాకు వరి విత్తనాలు వచ్చేశాయి. సన్నరకాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం బీపీటీ విత్తనాలు సరఫరా చేసింది. జిల్లాలో 15 మండలాలుండగా 9 మండలాలకు 1366.25 క్వింటాళ్లు కేటాయించింది. అవసరాలను బట్టి మరిన్ని విత్తనాలను సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. విత్తనాలను విక్రయించే బాధ్యతను డీసీఎంఎస్‌, పీఏసీఎస్‌, ఎల్‌ఏసీఎస్‌లకు అప్పగించింది. శంకరపట్నం మండలానికి అత్యధికంగా 473.75 క్వింటాళ్లు సరఫరా చేయగా, ఇందులో గద్దపాక పీఏసీఎస్‌కు 156.25, మెట్‌పల్లి పీఏసీఎస్‌కు 192.50, తాడికల్‌ పీఏసీఎస్‌కు 50, శంకరపట్నం డీసీఎంఎస్‌కు 75 క్వింటాళ్ల విత్తనాలను కేటాయించింది. మానకొండూర్‌ మండలానికి 190 క్వింటాళ్లు కేటాయించగా దేవంపల్లి పీఏసీఎస్‌కు 60, మానకొండూర్‌ ఎల్‌ఎస్‌సీఎస్‌కు 40 , డీసీఎంఎస్‌కు 90 క్వింటాళ్ల చొప్పున కేటాయించింది. హుజూరాబాద్‌ మండలానికి 142 క్వింటాళ్లు కేటాయించగా జూపాక పీ ఏసీఎస్‌కు 62.50, హుజూరాబాద్‌ పీఏసీఎస్‌కు 40, హుజూరాబాద్‌ డీసీఎంఎస్‌కు 40 క్వింటాళ్లు ఇచ్చింది. జమ్మికుంట మండలానికి 80 క్వింటాళ్లు కేటాయించగా తనుగుల పీఏసీఎస్‌కు 30, జమ్మికుంట డీసీఎంఎస్‌కు 50 క్వింటాళ్లు కేటాయించింది. తిమ్మాపూర్‌ మండలానికి 125 క్వింటాళ్లు కేటాయించగా అల్గునూర్‌ డీసీఎంఎస్‌కు 50, తిమ్మాపూర్‌ సొసైటీకి 50, పర్లపెల్లి డీసీఎంఎస్‌కు 25 క్వింటాళ్లు ఇచ్చింది. గన్నేరువరం మండలానికి 80 క్వింటాళ్లు కేటాయించగా ఏఆర్‌ఎస్‌కేకు 42.50, డీసీఎంఎస్‌కు 37.50 క్వింటాళ్లు ఇచ్చింది. ఇల్లందకుంట మండలానికి 80 క్వింటాళ్లు కేటాయించగా బోగంపాడు పీఏసీఎస్‌కు 40, ఇల్లందకుంట డీసీఎంఎస్‌కు 40, సైదాపూర్‌ మండలంలోని ఎల్‌ఎస్‌సీఎస్‌కు 165 క్వింటాళ్లు , చిగురుమామిడి మండలంలోని డీసీఎంఎస్‌కు 30 క్వింటాళ్లను సరఫరా చేసింది. కాగా, ఒక్కో బస్తా 25 కిలోలు ఉండగా, రూ.775గా ప్రభుత్వం ధర నిర్ణయించింది. మేలైన విత్తనాలను రైతుల కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్నదని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.