గురువారం 03 డిసెంబర్ 2020
Peddapalli - May 27, 2020 , 02:52:16

సర్పంచ్‌ ట్వీట్‌కు స్పందించిన మంత్రి కేటీఆర్‌

 సర్పంచ్‌ ట్వీట్‌కు స్పందించిన మంత్రి కేటీఆర్‌

మేడిపల్లి : మండలంలోని రాగోజిపేట గ్రామానికి చెందిన రాణవేని లక్ష్మి భర్త నల్లగోండం 18 నెలల క్రితం, కుమారుడు పవన్‌ ఈనెల 5న మృ తి చెందారని, రాణవేని లక్ష్మి ఆర్థిక ఇబ్బందులపై మంత్రి కేటీఆర్‌కు సర్పంచ్‌ బాలుసాని లహరిక ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. స్పందించిన మంత్రి కేటీఆర్‌ మంగళవారం అధికారులను రాణవేని లక్ష్మి వద్దకు పంపారు. మంత్రి ఆదేశాల మేరక లక్ష్మి కుటుంబ పరిస్థితిపై నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు తహసీల్దార్‌ రాజేశ్వర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ మండలాధ్యక్షుడు బాలుసాని మారుతిగౌడ్‌  పాల్గొన్నారు.