శనివారం 30 మే 2020
Peddapalli - May 24, 2020 , 00:37:39

మండుటెండల్లో నిండుకుండలు

మండుటెండల్లో నిండుకుండలు

సాధారణంగా ఎండకాలం వచ్చిందంటే భూగర్భ జలాలు పాతాళానికి చేరుతాయి. చెరువులు, వ్యవసాయ బావులైతే అడుగంటుతాయి. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని ఉమ్మడి జిల్లాలో ఇప్పుడా దుస్థితి లేకుండా పోయింది. వరద కాలువ, ఎస్సారెస్పీ కాలువల ద్వారా ఊరూరా చెరువులు నింపడంతో పాతాళ గంగ ఉబికివస్తున్నది. వ్యవసాయ బావుల్లో నీరు పైకి చేరుతున్నది. మండుటెండల్లోనూ రాయికల్‌ మండలం అల్లీపూర్‌, ఓదెల మండలం నాంసానిపల్లిలోని బావులు ఇలా నిండుగా తొణికిసలాడుతున్నాయి. భూ ఉపరితలానికి సమాంతరంగా నీరుండి సంబంధిత రైతులకు కొండంత భరోసానిస్తున్నాయి.

-రాయికల్‌  


logo