ఆదివారం 29 నవంబర్ 2020
Peddapalli - May 15, 2020 , 01:48:35

‘పంటమార్పిడి’లో ఆదర్శంగా నిలువాలి

‘పంటమార్పిడి’లో ఆదర్శంగా నిలువాలి

  • ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌

చొప్పదండి : పంటమార్పిడి విధానంలో చొప్పదండి నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలుపాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ వ్యవసాయాధికారులకు సూచించారు. చొప్పదండిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల ఏవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు నియోజకవర్గ రైతులు పంటమార్పిడి పద్ధతి పాటిస్తూ, సాగు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. మల్లన్నపల్లి రైతుల వలే నియోజకవర్గంలో ఏయే పంటలు పండిస్తున్నారు? కూరగాయలు సాగు చేస్తున్నారా? కోళ్లు, పశువులు పెంచుతున్నారా? తదితర విషయాలపై సర్వే చేసి నివేదిక అందించాలని సూచించారు. అలాగే వేసవిలో ఏ పంటలు పండిస్తే అధిక దిగుబడి వస్తుందో రైతులకు అవగాహన కల్పించి, సాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు.