ఆదివారం 29 నవంబర్ 2020
Peddapalli - May 12, 2020 , 01:41:16

రైతుల విషయంలో రాజకీయాలొద్దు

రైతుల విషయంలో రాజకీయాలొద్దు

  • డీసీఎమ్మెస్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి

ధర్మపురి : రైతుల విషయంలో రాజకీయాలు తగవని డీసీఎమ్మెస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి హితవు పలికారు. సోమవారం వెల్గటూర్‌ మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ గడ్డం వివేక్‌ ఏదో పనిపై వెళ్తూ కాలక్షేపం కోసం వెల్గటూర్‌లో ఓ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులకు అన్యాయం జరుగుతున్నదని మాట్లాడడం బాధాకరమన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 20లక్షల క్వింటాళ్ల ధాన్యం కొన్నామని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని మంత్రి ఈశ్వర్‌ అధికారులను ఇదివరకే ఆదేశించారని గుర్తు చేశారు. జిల్లాలో నేటివరకు 50శాతం కొనుగోళ్లు పూర్తి కాగా, 30శాతం రైతుల ఖాతాల్లో డబ్బులు కూడా జమయ్యాయని చెప్పారు. ఇక్కడ జడ్పీటీసీ సభ్యురాలు సుధారాణి, పీఏసీఎస్‌ చైర్మన్‌ రత్నాకర్‌, జగన్‌, లింగయ్య, రామస్వామి తదితరులున్నారు.