శనివారం 28 నవంబర్ 2020
Peddapalli - May 12, 2020 , 01:41:17

ఇబ్బందుల్లేకుండా పింఛన్‌ అందించాలి

ఇబ్బందుల్లేకుండా పింఛన్‌ అందించాలి

జగిత్యాల, నమస్తే తెలంగాణ/ జగిత్యాల : జిల్లాలో ఆసరా లబ్ధిదారులకు ఇబ్బందుల్లేకుండా పింఛన్‌ అందించాలని కలెక్టర్‌ గుగులోతు రవి ఆదేశించారు. జిల్లాలో ఆసరా పింఛన్లపై సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్యాంక్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, పోస్టల్‌ శాఖ చొరవ తీసుకోవాలని సమస్యలు లేకుండా చూడాలని పేర్కొన్నారు. ఎండలు బాగా ఉన్నందున లబ్ధిదారులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా వీలైతే ఎక్కువ కౌంటర్లు పెట్టాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో అరుణశ్రీ, డీఆర్డీవో పీడీ లక్ష్మీనారాయణ, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ గౌతం లక్ష్మీనారాయణ, పోస్టల్‌ శాఖ హెడ్‌ పోస్ట్‌మాస్టర్‌ రఘుపతి తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్న వారిని ఇప్పటివరకు 1,395 మందిని గుర్తించామని కలెక్టర్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో ఆడిటర్‌ బద్రి నరేశ్‌ అందించిన ఆపరేటెడ్‌ హ్యాండ్‌ శానిటైజర్లను ఆయన ప్రారంభించారు. ఇక్కడ డాక్టర్‌ జంగిలి శశికాంత్‌ రెడ్డి, అరవింద్‌, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా కమిటీ సభ్యుడు సిరిసిల్ల శ్రీనివాస్‌ ఉన్నారు.