గురువారం 03 డిసెంబర్ 2020
Peddapalli - May 12, 2020 , 01:41:18

రైతు సంక్షేమమే కేసీఆర్‌ ధ్యేయం

రైతు సంక్షేమమే కేసీఆర్‌ ధ్యేయం

  • గోదావరి పరివాహక ప్రాంతాల్లో పామాయిల్‌ సాగు ఆలోచన హర్షణీయం
  • ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

గోదావరిఖని/పాలకుర్తి/ఫెర్టిలైజర్‌సిటీ: రైతు సంక్షే మం, ఆర్థిక అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో పామాయిల్‌ సాగుకు ఆలోచనలు చేయడం హర్షణీయమని, రైతులు అధిక లాభాలు ఆర్జించేందుకు ఈ విధానం ఎంతో దోహదపడుతుందని చెప్పారు. రైతన్నకు దన్నుగా సరికొత్త నిర్ణయాలు తీసుకోవడాన్ని హర్షిస్తూ గోదావరిఖనిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి అంతర్గాం మండల రైతులతో కలిసి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. అలాగే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సుల్తానాబాద్‌ మండల రైస్‌ మిల్లర్లతో ఎమ్మెల్యే మాట్లాడారు. కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. క్యాంపు కార్యాలయంలో  కేశోరాం ప్లాంట్‌హెడ్‌ రాజేశ్‌గర్గ్‌, హెచ్‌ఆర్‌ జీఎం గోవిందరావుతో సమావేశమై, సీఎం ఆదేశాల మేరకు పర్మినెంట్‌ కార్మికుల మాదిరిగానే కాంట్రాక్టు కార్మికులకు లాక్‌డౌన్‌ కాలానికి గాను వేతనాలు చెల్లించాలని ఎమ్మెల్యే సూచించారు. అలాగే కమిషనరేట్‌ కార్యాలయంలో రామగుండం సీపీని కలిసి లాక్‌డౌన్‌ సందర్భంగా సీజ్‌ చేసిన వాహనాలను యజమానులకు అప్పగించాలని వినతి పత్రం అందజేశారు. ఇప్పటికే ట్రాఫిక్‌ పోలీసులు సీజ్‌ చేసిన వాహనాలను రిలీజ్‌ చేశామని, త్వరలో పోలీసుల ఆధీనంలోని 9వేల వాహనాలను ఇచ్చేస్తామని సీపీ తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో నగర మేయర్‌ అనిల్‌కుమార్‌, డిప్యూటీ మేయ ర్‌ అభిషేక్‌ రావు, పాలకుర్తి జడ్పీటీసీ సంధ్యారాణి, సర్పంచులు ధర్ని రాజేశ్‌, దుర్గం జగన్‌, సతీశ్‌, బండారి ప్రవీణ్‌, కార్పొరేటర్లు రాజ్‌కుమార్‌, సదానందం, నాయకులు మహేందర్‌ రెడ్డి, మధుకర్‌ రెడ్డి, దుర్గం రాజేశ్‌, అరవింద్‌, తంగెడ అనిల్‌రావు ఉన్నారు.