మంగళవారం 24 నవంబర్ 2020
Peddapalli - May 10, 2020 , 02:39:25

ఆందోళన వద్దు.. పరిహారం చెల్లిస్తాం

ఆందోళన వద్దు.. పరిహారం చెల్లిస్తాం

  • జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌
  • ఈఎన్సీ వెంకటేశ్వర్లుతో కలిసి సరస్వతీ, పార్వతీ బరాజ్‌ల పరిధిలో ముంపు ప్రాంతాల పరిశీలన 

మంథనిటౌన్‌/రామగిరి: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల్లో నీటి మట్టం పెరిగితే ముంపులోకి వెళ్లే ప్రాంతాలకు పరిహా రం చెల్లిస్తామని, తీర ప్రాంత ప్రజలు ఆం దోళన చెందవద్దని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ పేర్కొన్నారు. సరస్వతీ బరా జ్‌లో నీటి మట్టం 117, పార్వతీ బరాజ్‌ లో 119 మీటర్లకు పెరిగితే ఏ ఏ ప్రాంతా లు ముంపులోకి వెళతాయనే విషయమై అధికారులు ముందస్తుగా అంచనా వే స్తుండగా, శనివారం మంథని, సిరిపు రం, రామగిరి మండలం చందనాపూర్‌ గ్రామాల్లోని గోదావరి తీరాన్ని ఈఎన్సీ న ల్లా వెంకటేశ్వర్లుతో కలిసి జడ్పీ చైర్మన్‌ పరిశీలించారు. పరిసర ప్రాంతాలలో పర్యటించి వివరాలు సేకరించారు. అలాగే నీ టి నిల్వ పెరిగితే మంథని గోదావరి తీరానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, మొసళ్ల బెడద లేకుండా సైడ్‌ వాల్స్‌ నిర్మిస్తామని, కంచె కూడా వేయిస్తామని చెప్పారు. కాగా, నీటి వసతి లేక పొలాలు బీడుగా మారుతున్నాయని రా మగిరి మండలంలోని పలు గ్రామాల రైతులు విజ్ఞప్తి చేయగా, బరాజ్‌ల వద్ద గే ట్‌ వాల్స్‌  ఏర్పాటు చేసి నీరందించేందు కు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శైలజ, ఎంపీపీ శంకర్‌, విండో చైర్మన్‌ శ్రీనివాస్‌, సర్పంచ్‌ దాసరి శంకరయ్య, ఎంపీటీసీ మల్లెపల్లి సుకన్య, ఈఈ విష్ణు ప్రసాద్‌ ఉన్నారు. మంథనిలో పలువురు కాంగ్రెస్‌ నాయకులు మధు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.