బుధవారం 25 నవంబర్ 2020
Peddapalli - May 07, 2020 , 02:53:22

రోడ్డు ప్రమాదంలో రైతు మృతి

రోడ్డు ప్రమాదంలో రైతు మృతి

  • ఏడాది క్రితం పెద్దకొడుకు, నాలుగు నెలల క్రితం చిన్నకొడుకు ఆత్మహత్య 

ముస్తాబాద్‌: ఏడాది క్రితం పెద్దకొడుకు, నాలుగు నెలల క్రితం చిన్నకొడుకు ఆత్మహత్య చేసుకోగా, ప్రస్తుతం తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ముస్తాబాద్‌ మండలం ఆవునూర్‌లో విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే.. ఆవునూర్‌కు చెందిన చిన్ని రాజిరెడ్డి(52)కి మంగళవారం సాయంత్రం ఛాతిలో నొప్పి వచ్చింది. బుధవారం ఉదయం వ్యవసాయ పనులు ముగించుకుని తన ద్విచక్రవాహనంపై ముస్తాబాద్‌లోని దవాఖానకు బయలుదేరిన రాజిరెడ్డి, మార్గమధ్యలో కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కాగా, జీవితంపై విరక్తిచెంది ఏడాది క్రితం రాజిరెడ్డి-రాజమ్మ దంపతుల పెద్ద కొడుకు మహేందర్‌రెడ్డి, ఉన్నత చదువులు చదివినా ఉదోగ్యం రాలేదని నాలుగు నెలల క్రితం చిన్నకొడుకు భాస్కర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. పేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని జడ్పీటీసీ నర్సయ్య, ఎంపీటీసీ లలిత, సర్పంచ్‌ కళ్యాణి కోరారు.