సోమవారం 30 నవంబర్ 2020
Peddapalli - May 06, 2020 , 01:54:35

సమాజ సేవే పరమావధిగా..

సమాజ సేవే పరమావధిగా..

  • వలసజీవులు, నిరుపేదలకు అండగా దాతలు
  • నిత్యావసర సరుకులు పంచుతూ బాసట

లాక్‌డౌన్‌ కాలంలో ఆపదగొన్నవారిని ఆదుకుంటూ సమాజ సేవే పరమావధిగా పలువురు దాతలు ముందుకు సాగుతున్నారు. నిరుపేదలు, వలసజీవులు, యాచకులకు నిత్యావసర సరుకులు అందిస్తూ, అన్నదానం చేసి ఆకలి తీరుస్తూ బాసటగా నిలుస్తున్నారు. 

జగిత్యాల నెట్‌వర్క్‌ : జగిత్యాల 2వ వార్డుకు చెందిన వెలుమల ప్రకాశ్‌ మనవరాలు అనిక్ష మొ దటి పుట్టిన రోజు సందర్భంగా పారిశుధ్య కార్మికులకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ చేతుల మీదుగా నిత్యావసరాలను పంపిణీ చేశారు. మోతె గ్రామానికి చెందిన తీగల రాజవ్వ అనారోగ్యంతో బాధపడుతుండగా రూ.13 వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అం దించారు. కోరుట్ల  మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో పారిశుధ్య కార్మికులకు వికాస తరంగిణి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సతీమణి సరోజన ప్రారంభించి భోజనం వడ్డించారు. పోలీసులకు శానిటైజర్స్‌, మాస్క్‌లను పంపిణీ చేశారు.  మున్సిపల్‌ అధ్యక్షురాలు లావణ్య, ఉపాధ్యక్షుడు గడ్డమీ ది పవన్‌, సీఐ రాజశేఖరరాజు, కమిషనర్‌ ఆయా జ్‌, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్‌ పాల్గొన్నారు. జగిత్యాల ఆర్టీసీ డిపో, బస్టాండ్‌లో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌, జగిత్యాల డిపో ఉద్యోగులకు సరుకులు పంపిణీ చేశారు. డీవీ ఎం నాగేశ్వర్‌రావు, డీఎం జగదీశ్‌ పాల్గొన్నారు. ప్రకృతి ఎన్విరాన్‌మెంట్‌ సొసైటీ ఆధ్వర్యంలో చైల్డ్‌లైన్‌ 1098, సఖి 181 ప్రాజెక్టు నిర్వాహకులు కడారి శ్రావణ్‌, మనోలా డీడబ్ల్ల్యూవో, డీఆర్వో, ఆర్డీవో, డీఎస్పీ, మున్సిపల్‌ కమిషనర్‌ కార్యాలయాల అధికారులకు, సిబ్బందికి మాస్కులు పం చారు. సొసైటీ నిర్వాహకురాలు జయశ్రీ ఉన్నారు. జిల్లాకేంద్రంలో భక్తమార్కండేయ ఆలయ ఆవరణలో నిరాశ్రయులు, వలసజీవులు, పారిశుధ్య కార్మికులకు శ్రీభక్తమార్కండేయ యువజన స్వ చ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ముదిగంటి రవీందర్‌రెడ్డి అల్పాహా రం అందజేశారు. కొడిమ్యాల మండలం డబ్బుతిమ్మాయపల్లి, హిమ్మత్‌రావుపేటకు చెందిన 15 మంది పారిశుధ్య కార్మికులకు టీఆర్‌ఎస్వీ మండలాధ్యక్షుడు అక్బర్‌ స్నేహితుడు కిరణ్‌ సరుకులను పంపిణీ చేశారు. రంజాన్‌ సందర్భంగా తుర్కాశీనగర్‌లో టీఆర్‌ఎస్‌ నాయకుడు అబ్దుల్‌షుకూర్‌ 65 కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశా రు. ధర్మపురిలో వలస కూలీలు, యాచకులకు ఆలయం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కొ నసాగింది. సుమారు 200 మంది రెండు పూ టలా భోజనం చేశారు. పట్టణంలో 108 సిబ్బందికి బీజేపీ సోషల్‌ మీడియా ఆధ్వర్యంలో సరుకు లు, శానిటైజర్లు, మాస్కులు ఇచ్చారు. గొల్లపల్లిలో నెహ్రూ యువకేంద్రం, రాష్ట్ర యంగ్‌ అచీవర్‌ అవార్డు గ్రహీత కొమ్ము శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఉపాధి కూలీలకు మాస్కులు ఇచ్చారు. మాజీ ఎం పీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో మెట్‌పల్లి పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేసిన నిత్యాన్నదాన కార్యక్రమాన్ని జాగృతి నాయకులు అమర్‌దీప్‌గౌడ్‌, కో కన్వీనర్‌ వెల్ముల శ్రీనివాస్‌రా వు, నియోజకవర్గ కన్వీనర్‌ ఎండీ జావీద్‌, పట్టణ కన్వీనర్‌ బీ కార్తీక్‌ కొనసాగించారు. పట్టణ శివారులో గుడారాలు వేసుకొని జీవిస్తున్న సంచార కు టుంబాలకు కోరుట్ల పట్టణానికి చెందిన సందరగి రి జగ్గయ్య-కమల దంపతులు బియ్యం, కూరగాయలు, ఇతర సామగ్రి అందజేశారు. మెట్‌పల్లి మండలం రామారావుపల్లెలో సర్పంచ్‌ ఏగుర్ల ల క్ష్మి ఉపాధి కూలీలకు, రైతులకు మాస్కులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందించారు. మేడిపల్లి మండలం వల్లంపల్లికి చెందిన 40 మంది దాతలు 15 క్వింటాళ్ల బియ్యాన్ని సర్పంచ్‌ వెల్మ సమత, తహసీల్దార్‌ రాజేశ్వర్‌ చేతుల మీదుగా నిరుపేద కు టుంబాలకు పంచారు. మల్లాపూర్‌ మండలం రా ఘవపేటలో 50 నిరుపేద కుటుంబాలకు బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెంకట్‌ ఆధ్వర్యంలో సరుకులు అందజేశారు. కోరుట్లలో వలస కూలీలు, నిరాశ్రయులైన 20 కుటుంబాలకు రియల్‌ ఎస్టేట్‌ సంస్థ జేఎస్‌ఆర్‌ గ్రూప్‌ సన్‌ సిటీ ప్రతినిధులు విజయ్‌కుమార్‌, ఆశీర్వాదం, బషీర్‌, భాస్కర్‌ సరుకు లు పంపిణీ చేశారు. కథలాపూర్‌ మండలం సిరికొండలో 20 వలస కార్మిక కుటుంబాలకు ఆర్‌ఎంపీ ప్రభురాజ్‌ కిశోర్‌ సరుకులు అందజేశారు.  

పెద్దపల్లి జిల్లా..

పెద్దపల్లి నెట్‌వర్క్‌ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదల ఆకలి తీర్చేందుకే ‘పెద్దపల్లి హెల్పింగ్‌ హ్యాండ్స్‌' ఏర్పాటు చేసి, నిత్యావసర సరుకులతోపాటు కూరగాయలను ఇంటింటికీ అందజేస్తున్నట్లు పెద్దపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిట్టిరెడ్డి మమతారెడ్డి తెలిపారు. వార్డులవారీగా అందిస్తున్న కూరగాయలను ఆటోట్రాలీల ద్వారా మంగళవారం పంపించారు. 21వ వార్డులో ఇంటింటికీ కూరగాయలు పంపిణీ చేశారు. ఇక్కడ పెద్దపల్లి ఏసీపీ ఎండీ హబీబ్‌ ఖాన్‌, ఎంపీపీ బండారి స్రవంతి, నాయకులు సయ్యద్‌ మోబిన్‌, పెద్ది వెంకటేశ్‌, పెంచాల శ్రీధర్‌, అక్కపాక తిరుపతి, ముడుసు చిన్న సాంబిరెడ్డి, చొప్పరి వంశీకృష్ణ, ఎండీ హబీబ్‌ ఉన్నారు. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ జన్మదినం సందర్భంగా పెద్దపల్లి మండలం చీకురాయిలోని 40 నిరుపేద కుటుంబాలకు టీఆర్‌ఎస్‌ నాయకుడు పడాల సతీశ్‌ గౌడ్‌ నిత్యావసర సరుకులు అందించారు. పూరేళ్ల వెంకటేశ్‌, పెంచాల శ్రీకాంత్‌, చందు, సాయి ఉన్నారు. ఎస్టీయూ ఆధ్వర్యంలో ఓదెల మండలంలోని 70 మంది వలస కూలీలు, పాత్రికేయులకు నిత్యావసర సరుకులు అందించారు. నాయకులు సంతోష్‌కుమార్‌, సతీశ్‌, తోట రాజు, ఎంపీపీ రేణుకాదేవి, జడ్పీటీసీ రాములు, తహసీల్దార్‌ రాంమోహన్‌, ఎంపీడీవో సత్తయ్య ఉన్నారు. పీఆర్టీయూ (టీఎస్‌)ఆధ్వర్యంలో కాల్వశ్రీరాంపూర్‌ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న 41 మంది స్కావెంజర్లకు నిత్యావసర సరుకులను ఎంపీపీ నూనేటి సంపత్‌, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, ఎంఈవో రాజయ్య చేతుల మీదుగా అందించారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కర్రు సురేశ్‌, కార్యదర్శి నాగేశ్వర్‌రావు, నాయకులు ముంజాల హరికృష్ణ, బండారి కుమార్‌, మోత్కూరి నారాయణ, పెద్దిరెడ్డి వీరారెడ్డి, అప్పాల అశోక్‌ ఉన్నారు. ఎలిగేడు మండలం ధూళికట్టలో ధాన్యం కోనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న హమాలీలకు ‘గోదారి కాంతలక్ష్మి’ సేవా సమితి ఆధ్వర్యంలో మాస్కులు, పండ్లు అందించారు. శాంతినగర్‌, సాగర్‌రోడ్‌, కమాన్‌ఏరియా, చీకురాయి రోడ్‌తోపాటు రాఘవాపూర్‌, నిట్టూరు, పెద్దకల్వల గ్రామాల్లో పేద మేదర కుటుంబాలకు జిల్లా మేదర సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గైని శ్రీనివాస్‌, నాయకులు గైని రాజు, మొల్మూరి రవీందర్‌, పందిల్ల లక్ష్మణ్‌, గైని శ్రీనివా స్‌ ఉన్నారు. గోదావరిఖని లక్ష్మీనగర్‌కు చెందిన సంతోష్మితి తన పాకెట్‌ మనీతో మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు, నిరుపేదలు 30 మందికి ఒక్కొక్కరికీ 25 కేజీల బియ్యం అందజేసింది. డ్యాన్స్‌ మాస్టర్‌ దేవా తన పుట్టిన రోజును పురస్కరించుకుని గోదావరిఖని కళాకారులకు నిత్యావసర సరుకులు అందజేశారు. పాలకుర్తి మండలం కన్నాల కు చెందిన భార్గవ్‌ మార్కండేయ కాలనీలోని ఎం డీహెచ్‌డబ్ల్యూఎస్‌ అనాథ పిల్లల సంరక్షణ కేంద్రానికి రూ.3వేల విలువైన సరుకులను అందజేయడంతోపాటు పిల్లలకు అన్నదానం చేశారు. ఎన్టీపీసీ దుర్గయ్యపల్లి ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం నడిపెల్లి రజితకుమారి సహకారంతో ఇందిరమ్మకాలనీలో కూరగాయలు పంపిణీ చేశారు. జనతా సేవ ఫౌం డేషన్‌ నిత్యావసర సరుకులు పంపిణీ చేయగా, ప్ర తిమా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 200 మందికి మా స్కులు అందించారు. ఏపీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా పరుశురాములు జయంతిని పురస్కరించుకుని అంతర్గాంలో తహసీల్దార్‌ బండి ప్రకాశ్‌, జడ్పీటీసీ ఆముల నారాయణ 70 కుటుంబాలకు కూరగాయలు అందజేశారు. సీఐటీయూ కార్యాలయం లో ఖని కళాకారులకు నిత్యావసర సరుకులు పం పిణీ చేశారు. కార్పొరేటర్లు మంచికట్ల దయాకర్‌, దొంత శ్రీనివాస్‌, దయానంద్‌ గాంధీ ఉన్నారు. ఫీడ్‌ ద నీడ్‌లో భాగంగా ఐఎన్టీయూసీ నాయకు డు మల్లేశ్‌, 40వ డివిజన్‌ కార్పొరేటర్‌ దుబాసి లలిత 150 మందికి అన్నదానం చేశారు. పాలకు ర్తి మండలంలోని ఉపాధి కూలీలకు ప్రజాప్రతినిధులు మజ్జిగ, అంబలి, అరటిపండ్లు అందించా రు. బసంత్‌నగర్‌లో జడ్పీటీసీ కందుల సంధ్యారా ణి, ఎంపీడీవో శివాజీ, సర్పంచ్‌ కట్టెకోల వేణుగోపాల్‌రావు అంబలి పంపిణీ చేశారు. ఫ్రెండ్స్‌ వెల్ఫే ర్‌ సొసైటీ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ ఏసీపీ రాంరెడ్డి చేతుల మీదుగా కాలనీవాసులు, పేదలకు బి య్యం, నిత్యావసరాలు అందించారు. సొసైటీ సభ్యులు మహ్మద్‌ రఫీ, సనత్‌కుమార్‌, చంద్రమోహన్‌, లక్ష్మణ్‌, రవీందర్‌, శ్రీనివాస్‌ ఉన్నారు. కరీంనగర్‌ ప్రతిమ ఫౌండేషన్‌, ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో రామగిరి మండలంలోని ప్రజలకు మాస్కులు అందజేశారు. సర్పంచులు గం టా పద్మ, పల్లె ప్రతిమ, నిర్వాహకులు రాజేందర్‌, నాగరాజు, సంతోష్‌ పాల్గొన్నారు.