గురువారం 26 నవంబర్ 2020
Peddapalli - Apr 27, 2020 , 01:45:21

అతిథుల్లేని పెళ్లిళ్లు

అతిథుల్లేని పెళ్లిళ్లు

  • లాక్‌డౌన్‌ కారణంగా నిరాడంబరంగా వివాహాలు
  • కేవలం ఇరు కుటుంబసభ్యుల నడుమ తంతు

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి,నమస్తేతెలంగాణ/సిరిసిల్ల టౌన్‌/చందుర్తి/ బుగ్గారం/కరీంనగర్‌ రూరల్‌ : లాక్‌డౌన్‌ కారణంగా పలువురి పెళ్లిళ్లు ఆదివారం నిరాడంబరంగా అతిథుల్లేకుండానే ఇరు కుటుంబాల నడుమ జరిగాయి. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్‌లో బియ్యాల లక్ష్మణ్‌రావు, వినూత్న వధూవరులు కేవలం 12 మంది సమక్షంలో గ్రామ శివారులోని సాంబశివాలయంలో వివాహం చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నెహ్రూనగర్‌లో దివంగత బొల్లి సత్యనారాయణ-రాణి దంపతుల కూతురు శ్రావణి పెళ్లి ఇంట్లోనే మల్లారం గ్రామానికి చెందిన అజయ్‌తో, చందుర్తి మండలం జోగాపూర్‌కు చెందిన వట్టిమల్ల రాజు, మంగ దంపతుల కూతురు దివ్య వివాహం వీర్నపల్లి మండలం అడవి పదిరకు చెందిన లచ్చయ్య, భారత దంపతుల కొడుకు బాలకృష్ణతో కేవలం 10 మంది కుటుంబసభ్యుల నడుమ జరిగింది. కరీంనగర్‌ రూరల్‌ మండలం చెర్లభూత్కూర్‌కు చెందిన గంగిపెల్లి దేవేంద్ర-కనుకయ్య దంపతుల కూతురు మహేశ్వరి వివాహం చిగురుమామిడి మండలం బొమ్మనపల్లికి చెందిన రాజవ్వ-పోచయ్య దంపతుల కొడుకు సంతోష్‌తో సాదాసీదాగా నిర్వహించారు. గతంలోనే వీరి వివాహాలను పెద్దలు నిశ్చయించగా, ఇప్పట్లో మంచి ముహూర్తాలు లేక పోవడంతో ఆదివారమే జరిపించారు.