శనివారం 28 నవంబర్ 2020
Peddapalli - Apr 24, 2020 , 01:37:32

ఆకలి తీర్చడంలో ఆదర్శం

ఆకలి తీర్చడంలో ఆదర్శం

  • పేద కుటుంబాలకు డిప్యూటీ మేయర్‌ దంపతుల చేయూత
  • 37 డివిజన్‌లో750 కుటుంబాలకు సాయం
  • కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌తో తమ డివిజన్‌లో ఇబ్బందులు పడుతున్న పేదలకు డిప్యూటీ మేయర్‌ దంపతులు చేయూతనిస్తున్నారు. ఆపత్కాలంలో ఆదుకుంటూ, ఆదర్శంగా నిలుస్తున్నారు. 37 డివిజన్‌ కార్పొరేటర్‌గా ఏకగ్రీవంగా విజయం సాధించి, ప్రస్తుతం డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి, హరిశంకర్‌ దంపతులు కరోనా నేపథ్యంలో వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. తమ డివిజన్‌లో 2,565 కుటుంబాలుండగా, ఇందులో నెలకు 15వేలకు తక్కువగా ఆదాయమున్న కుటుంబాలను గుర్తించేందుకు సొంతంగా సర్వే చేశారు. పని చేస్తేనే పూట గడిచే వారిలో 750 కుటుంబాలున్నట్లుగా గుర్తించి, వారందరికీ అండగా నిలుస్తున్నారు. తొమ్మిది రకాల నిత్యావసర సరుకులను ప్యాక్‌ చేయించి, పేదల ఇళ్లకు వెళ్లి స్వయంగా అందిస్తున్నారు. దీనికి కొంత మంది దాతల సాయం తీసుకొని, చల్ల బాలయ్య మెమోరియల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే గుర్తించిన వారిలో 75 శాతం కుటుంబాలకు సరకులు అందించామని, ఒకటి రెండు రోజుల్లో వందశాతం మందికి అందిస్తామని ట్రస్టు చైర్మన్‌ చల్ల హరిశంకర్‌ తెలిపారు. తాము చేసే మంచి కార్యక్రమానికి చేయూతనిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. 

  • పేద కుటుంబాలకు డిప్యూటీ మేయర్‌ దంపతుల చేయూత
  • 37 డివిజన్‌లో750 కుటుంబాలకు సాయం

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌తో తమ డివిజన్‌లో ఇబ్బందులు పడుతున్న పేదలకు డిప్యూటీ మేయర్‌ దంపతులు చేయూతనిస్తున్నారు. ఆపత్కాలంలో ఆదుకుంటూ, ఆదర్శంగా నిలుస్తున్నారు. 37 డివిజన్‌ కార్పొరేటర్‌గా ఏకగ్రీవంగా విజయం సాధించి, ప్రస్తుతం డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి, హరిశంకర్‌ దంపతులు కరోనా నేపథ్యంలో వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. తమ డివిజన్‌లో 2,565 కుటుంబాలుండగా, ఇందులో నెలకు 15వేలకు తక్కువగా ఆదాయమున్న కుటుంబాలను గుర్తించేందుకు సొంతంగా సర్వే చేశారు. పని చేస్తేనే పూట గడిచే వారిలో 750 కుటుంబాలున్నట్లుగా గుర్తించి, వారందరికీ అండగా నిలుస్తున్నారు. తొమ్మిది రకాల నిత్యావసర సరుకులను ప్యాక్‌ చేయించి, పేదల ఇళ్లకు వెళ్లి స్వయంగా అందిస్తున్నారు. దీనికి కొంత మంది దాతల సాయం తీసుకొని, చల్ల బాలయ్య మెమోరియల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే గుర్తించిన వారిలో 75 శాతం కుటుంబాలకు సరకులు అందించామని, ఒకటి రెండు రోజుల్లో వందశాతం మందికి అందిస్తామని ట్రస్టు చైర్మన్‌ చల్ల హరిశంకర్‌ తెలిపారు. తాము చేసే మంచి కార్యక్రమానికి చేయూతనిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.