మంగళవారం 24 నవంబర్ 2020
Peddapalli - Apr 24, 2020 , 01:32:35

మరింత కఠినంగా లాక్‌డౌన్‌

మరింత కఠినంగా లాక్‌డౌన్‌

  • రామగుండం సీపీ సత్యనారాయణ
  • తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు పరిశీలన

కోటపల్లి : లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. కోటపల్లి మండలం రాపనపల్లి అంతర్రాష్ట్ర వంతెన వద్ద తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టును గురువారం తనిఖీ చేశారు. పొరుగు రాష్ర్టాల వారిని జిల్లాలోకి అనుమతించేది లేదని, వైద్య సేవలకు మాత్రం మినహాయింపు ఉంటుందని చెప్పారు. సరిహద్దు భద్రతపై సిరొంచ ఎస్‌డీపీవో ప్రశాంత్‌తో మాట్లాడారు. మంచిర్యాల డీసీపీ ఉదయ్‌ కుమార్‌, జైపూర్‌ ఏసీపీ నరేందర్‌, చెన్నూర్‌ రూరల్‌, టౌన్‌ సీఐలు నాగరాజు, ప్రమోద్‌ కుమార్‌, కోటపల్లి ఎస్‌ఐ రవి కుమార్‌ పాల్గొన్నారు.