శనివారం 05 డిసెంబర్ 2020
Peddapalli - Apr 11, 2020 , 02:48:09

శెభాష్‌ శశాంక

శెభాష్‌ శశాంక

కరోనా కట్టడిలో నిరంతరం శ్రమిస్తున్న కరీంనగర్‌ కలెక్టర్‌ కే శశాంక, విపత్కర పరిస్థితుల్లోనూ సామాజిక బాధ్యతను చాటారు. లాక్‌డౌన్‌తో బ్లడ్‌ బ్యాంకుల్లో రక్తం కొరత ఏర్పడగా, తనవంతు కర్తవ్యం నెరవేర్చారు. కరీంనగర్‌ ప్రభుత్వ వైద్యశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సీపీ కమలాసన్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌తో కలిసి రక్తదానం చేశారు. మనం దానం చేసే ప్రతి రక్తపు బిందువూ మరొకరికి ప్రాణం పోసే అమృత బిందువు అవుతుందని చెప్పారు. ప్రస్తుతం ఎంతో మంది కొవిడ్‌-19 బాధితులు అపాయంలో ఉన్నారని, ఇలాంటి వారిని ఆపత్కాలంలో ఆదుకునేందుకు ప్రతి పౌరుడూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇదే శిబిరంలో రెవెన్యూ, పోలీసు సిబ్బంది కూడా రక్తదానం చేశారు.  

- కరీంనగర్‌హెల్త్‌