బుధవారం 03 జూన్ 2020
Peddapalli - Apr 06, 2020 , 00:44:24

శెభాష్‌ కనకయ్య..

శెభాష్‌ కనకయ్య..

కరోనా నియంత్రణకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా కృషి చేస్తున్నారు. పలువురు పేదలకు అండగా నిలుస్తుంటే.. మరికొందరు ప్రభుత్వానికి బాసటగా ఉంటున్నారు. అందులో భాగంగా సిరిసిల్ల నెహ్రూనగర్‌కు చెందిన దర్జీ కనకయ్య సిరిసిల్లతోపాటు టెక్స్‌టైల్‌ పార్క్‌లోని పేదలకు పంపిణీ చేసేందుకు వీలుగా మణికంఠ టైలర్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ సభ్యుల సహకారంతో 3వేల మాస్కులను తయారు చేశారు. వాటిని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌కు అందజేయగా, ‘శెభాష్‌ కనకయ్య’ అంటూ కృష్ణభాస్కర్‌ అభినందించారు.  

- కలెక్టరేట్‌


logo