మంగళవారం 01 డిసెంబర్ 2020
Peddapalli - Apr 05, 2020 , 03:17:04

కట్టడికి పకడ్బందీ చర్యలు

కట్టడికి పకడ్బందీ చర్యలు

  • రెడ్‌జోన్‌ పరిధిలో ప్రజలంతా స్వీయ నిర్బంధం పాటించాలి
  • రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌
  • రామగుండంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష 
  • రెండోసారి ఫీవర్‌ సర్వే చేయాలని ఆదేశం
  • కరీంనగర్‌లో పోస్టర్‌ ఆవిష్కరణ
  • వయోవృద్ధుల కోసం 14567, దివ్యాంగుల కోసం 1800-572-8980 టోల్‌ఫ్రీ నంబర్ల ఏర్పాటు

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ/గోదావరిఖనిటౌన్‌: రామగుండంలో కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొ ప్పుల ఈశ్వర్‌ ఆదేశించారు. ఎన్టీపీసీలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో అత్యవసరంగా జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు, ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, అడిషనల్‌ కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, సీపీ సత్యనారాయణ, మేయర్‌ అనిల్‌కుమార్‌తో కలిసి కార్పొరేషన్‌ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించా రు. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ చుట్టూ కిలోమీటర్‌ పరిధిలో రెడ్‌జోన్‌ ప్రకటించామని, ప్రజలెవరూ ఇండ్లలోంచి బయటికి రావద్దని సూచించారు. నగరంలో రెండోసారి ఫీవర్‌ సర్వే చేయాలని ఆదేశించిన ఆయన, సర్వే సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. వైద్యులు, సిబ్బంది, పారిశుధ్య సి బ్బందికి అవసరమైన మాస్కులు ఇతర పరికరాల కొరత రాకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్‌కు సూచించారు. కరోనా నేపథ్యంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు. అలాగే క్వారంటైన్‌ సెంటర్లలో మౌలిక వసతులు క ల్పించాలని, పోలీస్‌ భద్రత సైతం ఉంచాలన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధిం చి చేస్తున్న ఏర్పాట్లను కూడా అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడు తూ, రెడ్‌జోన్‌ పరిధిలో ప్రజలెవరూ ఇండ్లలోంచి బయటకు రాకుండా బారికేడ్లు ఏ ర్పాటు చేశామని, నిత్యావసర సరుకులు ఇంటికే పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ముందస్తుగా మరో 600 పడకలతో క్వారంటైన్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం ప్రత్యేక చర్యలు..

ధర్మపురి,నమస్తేతెలంగాణ : కరోనా మహమ్మారి బారిన పడకుండా దివ్యాంగు లు, వయోవృద్ధుల కోసం ప్రభుత్వం ప్రత్యే క చర్యలు చేపడుతున్నదని మంత్రి కొప్పు ల ఈశ్వర్‌ తెలిపారు. ఈ మేరకు శనివారం కరీంనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. వయోవృద్ధుల కోసం 14567, దివ్యాంగుల కోసం 1800-572-8980 ప్రత్యేక హెల్ప్‌లైన్‌ టోల్‌ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించా రు. రాష్ట్రంలో ఏమూల నుంచైనా దివ్యాంగులు, వయోవృద్ధులు ఈ నంబర్లకు డయల్‌ చేసి ప్రభుత్వ సేవలు పొందాలని సూచించారు.