ఆదివారం 29 నవంబర్ 2020
Peddapalli - Mar 29, 2020 , 02:38:04

ఆకలి తీర్చడం అభినందనీయం

ఆకలి తీర్చడం అభినందనీయం

  • ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌
  • రెడ్‌ క్రాస్‌, రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో 85 మంది వలస కూలీలకు భోజన సరుకులు అందజేత
  • జగిత్యాల మండలంలో పర్యటన
  • కరోనాపై జాగ్రత్త పాటించాలని సూచన

జగిత్యాల రూరల్‌ : వలస కూలీల ఆకలి తీర్చడం అభినందనీయమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండాఉండేందుకు జగిత్యాల రూరల్‌ మండలంలోని చల్‌గల్‌ గ్రామంలో మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చి 85మంది వలస కూలీలకు రెడ్‌క్రాస్‌, రోటరీ క్లబ్‌లు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో భోజన సరుకులు, సబ్బులు, బిస్కెట్లు, పప్పు ధాన్యాలతో కూడిన సంచులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, యేటా మామిడికాయల ఎగుమతి, ప్యాకింగ్‌ కోసం వందలాది మంది కూలీలు వస్తుంటారన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చిన వలస కూలీలకు రెడ్‌క్రాస్‌ సొసైటీ, రోటరీ క్లబ్‌ ముందుకు వచ్చి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా జగిత్యాల మండలంలోని మోతె గ్రామంలో యాంటీ బ్యాక్టీరియా మందును స్ప్రే చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్‌ ఎంపీపీ గాజర్ల గంగారాం గౌడ్‌, రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్‌, రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు ఏవీఎల్‌ఎన్‌ చారి, మాజీ అధ్యక్షుడు టీవీ సూర్యం, ఎంవీ నర్సింహా రెడ్డి, సర్పంచులు ఎల్ల గంగనర్సు, సురకంటి స్వప్న, ఎంపీటీసీ రాజశేఖర్‌ రెడ్డి, ఉప సర్పంచ్‌ పద్మ, నాయకులు ఎల్ల రాజన్న, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.